indian killed
-
Russia-Ukraine war: రష్యా యుద్ధక్షేత్రంలో మరో భారతీయుడు మృతి
చండీగఢ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యారు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుడిని పొట్టనబెట్టుకుందని హరియాణాకు చెందిన అజయ్ మౌన్ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్ జనవరి 13న రష్యా వెళ్లారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్ ఆరోపించారు. రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.11.50 లక్షలు ఖర్చుపెట్టామని వాపోయారు. రవి మరణవార్తను మాస్కోలోని భారతీయ ఎంబసీ ధ్రువీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపేస్తామంటూ ప్రధాని మోదీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ విషాదం వెలుగుచూడటం గమనార్హం. యుద్ధంలో పనిచేయడం రవికి సుతరామూ ఇష్టంలేదని, ఫోన్లో ముభావంగా మాట్లాడేవారని మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్‌లోనే ఉన్నామని సోదరుడు అజయ్ చెప్పారు. మృతదేహం గుర్తింపు కోసం డీఎన్ఏ నమూనాలను పంపాలని డిమాండ్ చేస్తున్నారని, అంత సొమ్ము తమ వద్ద లేదని, మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్ సాయం చేయాలని ఆయన వేడుకున్నారు. -
లండన్‌లో కత్తిపోట్లతో భారతీయుడు దుర్మరణం
లండన్: దక్షిణ లండన్‌లో భారతీయుడు ఒకరు వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. కేరళకు చెందిన అరవింద్ శశికుమార్ (38)ను సౌత్‌వార్క్‌లో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న శశికుమార్ ఆస్పత్రికి తరలించే లోపు మరణించినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్ సలీమ్ (25) అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తేజస్విని రెడ్డిని కత్తితో పొడిచి చంపిన మూడు రోజుల్లోనే మరొక భారతీయుడు అదే విధంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
Turkey-Syria earthquake: ఆశలు సమాధి?
అంటాక్యా: తుర్కియే, సిరియాలో భూకంపం వచ్చి అయిదు రోజులు దాటిపోవడంతో కనిపించకుండా ఉన్న తమ సన్నిహితులు క్షేమంగా తిరిగి వస్తారన్న విశ్వాసం అందరిలోనూ సన్నిగిల్లుతోంది. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ శవాల గుట్టలు బయటకు వస్తూనే ఉన్నాయి. తుర్కియేలో హతే ప్రావిన్స్‌కు వెళ్లి ఫుట్‌బాల్ బృందంలో ఉన్న వారందరి మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు తుర్కియేలో మాత్రమే 80 వేల మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, 10 లక్షల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ శవాల మధ్య జీవచ్ఛవాలుగా మారిన కొందరు కొన ఊపిరితో ఉన్న ప్రాణాలతో బయటపడుతున్నారు. 80 ఏళ్ల ముదుసలి నుంచి పది రోజుల బాలుడు వరకు దాదాపుగా 120 గంటల సేపు శిథిలాల కింద కూరుకుపోయిన వారు ఇప్పటివరకు 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ వాసి మృతి భూకంపం వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన భారతీయుడు, ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్ గౌడ్ మరణించాడు. అతను బస చేసిన హోటల్ శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ గౌడ్ బెంగళూరు కంపెనీలో పని చేస్తున్నారు. ఆఫీసు పని మీద తుర్కియే వెళ్లారు. అప్పుడే కుదిపేసిన భూకంపం ఆయన నిండు ప్రాణాలను తీసేసింది. అతని చేతి మీద ఉన్న ఓం అన్న టాటూ సాయంతో గౌడ్ మృతదేహాన్ని గుర్తు పట్టినట్టుగా భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒకే కుటుంబంలో ఐదుగురు క్షేమం గజియాంటెప్ ప్రావిన్స్ నర్డాగ్‌లో ఒక ఇల్లు కుప్పకూలిపోయి, ఆ ఇంట్లో శిథిలాల కింద చిక్కిన ఉన్న ఐదుగురు కుటుంబసభ్యులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మొదట తండ్రి హసన్ అస్లాన్‌ను శిథిలాల కింద నుంచి బయటకు తీయాలని అనుకుంటే , ఆయన తన కొడుకు, కూతుళ్లని మొదట బయటకు తీయండని మొరపెట్టుకున్నాడు. మొత్తమ్మీద అందరినీ కాపాడిన సహాయ సిబ్బంది గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. పదిరోజుల పసికందు మృత్యుంజయుడు గడ్డ కట్టించే చలి, భవనం శిథిలాల మధ్య, నీళ్లు, పాలు లేకుండా భూకంపం పది రోజుల వయసున్న బాలుడు 90 గంటల సేపు పోరాటం చేశాడు. చివరికి గెలిచి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. తుర్కియేలో భూకంప ప్రభావం అధికంగా ఉన్న హతే ప్రావిన్స్‌లో శిథిలాల కింద తల్లి, తన పదేళ్ల బాలుడు యాగిజ్ ఉలాస్‌తో నాలుగు రోజులు అలాగే ఉండిపోయింది. సహాయ సిబ్బంది సిమెంట్ శ్లాబుల తొలగిస్తూ ఉండగా ఆ పసికందు మూలుగు వినిపించింది. జాగ్రత్తగా శిథిలాల నుంచి తొలగించి ప్రాణాలతో ఉన్న ఆ బాలుడిని థర్మల్ బ్లాంకెట్‌లో చుట్టి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మిరాకిల్ బాయ్ చురుగ్గా ఉన్నప్పటికీ తల్లి బాగా నీరసించిపోయే దశలో ఉంది. -
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
వాషింగ్టన్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ఒకరు మంగళవారం అకస్మాత్తుగా చనిపోయాడు. నార్త్ కరొలినాలో నివసించే శివ చలపతి రాజు ఆరకిల్ సంస్థలో డెవలపర్‌గా ఉన్నారు. అంతకుముందు, ఆయన విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల్లో పనిచేశారు. రాజు మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. గ్రీన్‌కార్డ్ లేకపోవడం వల్ల రాజు భార్య బాబీ సౌజన్య భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు మిత్రులు పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని అమెరికన్ బజార్ పత్రిక పేర్కొంది. కాగా శివ చలపతి రాజు రాజమండ్రిలో చదువుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారతీయుడిని పొట్టనపెట్టుకున్న దొంగలు
దుబాయ్: దొంగతనాన్ని అడ్డుకోబోయి ఒమన్ లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కేరళకు చెందిన జాన్ ఫిలిప్ హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 10 నుంచి అతడు కనిపోయించకుండా పోయాడు. పెట్రోల్ బంకులోని ఆరున్నర లక్షల రూపాయలు మాయం కావడంతో ఈ డబ్బుతో ఫిలిప్ పారిపోయాడని తొలుత భావించారు. అయితే అతడు హత్యకు గురైనట్టు తెలియడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆరుగురు ఒమన్ దేశస్థులు అతడిని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా సీసీ టీవీ క్యాసెట్లను మాయం చేశారు. 13 ఏళ్లుగా ఒమన్ లో పనిచేస్తున్న ఫిలిప్ కు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిలిప్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కేరళ, కేంద్ర ప్రభుత్వాలను అతడి బంధువులు కోరారు. -
తాలిబన్ల దాడిలో భారతీయుడి మృతి
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలో తాలిబన్లు ఓ ప్రముఖ హోటల్‌పై చేసిన దాడిలో ఓ భారతీయుడు సహా తొమ్మిది మంది మరణించారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒక భారతీయులు, ఒక పాకిస్థానీ, కెనడా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఇద్దరేసి మహిళలు, ఓ పాకిస్థానీ మృతుల్లో ఉన్నారు. కాబూల్‌లోని సెరెనా హోటల్ మీద ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు పిస్టళ్లతో వచ్చి, తాము భోజనానికి వచ్చినట్లు నటించారు. తర్వాత అక్కడ భోజనం చేస్తున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇంతకుముందు జనవరిలో కూడా విదేశీయులు ఉన్న రెస్టారెంటు మీద కాబూల్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి మొత్తం 21 మందిని బలిగొన్నారు. -
ఇస్లాం గురించి చెప్పలేదని.. భారతీయుడి కాల్చివేత
ఇస్లాం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనందుకు నైరోబీలోని ఓ మాల్లో భారతీయుడిని కాల్చి చంపారు. జోషువా హకీమ్ అనే వ్యక్తి మాల్‌కు వెళ్లగా, అక్కడకు కొందరు టీనేజర్లు, మరికొందరు ఆయుధాలు ధరించి వచ్చారు. వారివద్ద ఏకే-47 అసాల్ట్ రైఫిళ్లున్నాయి. వారు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపినట్లు ద గార్డియన్ వెబ్సైట్ పేర్కొంది. ముస్లింలు ఎవరో గుర్తించడానికి సాయుధులు స్వాహిలి భాషలో మాట్లాడి, సమాధానాలు ఇచ్చినవారిని అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. హకీమ్ తన ఐడీ కార్డు మీద పేరులో ఉన్న క్రిస్టియన్ పదాన్ని వేలితో మూసేసి.. సాయుధుల్లో ఒకరి వద్దకు వెళ్లాడు. వాళ్లు తనను వెళ్లిపొమ్మని చెప్పారని, కానీ ఒక భారతీయుడు వచ్చినప్పుడు మాత్రం మహ్మద్ తల్లి పేరేంటని అడిగారని, అతడు సమాధానం చెప్పలేకపోవడంతో వెంటనే కాల్చి చంపేశాడని హకీమ్ తెలిపాడు.