అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలో తాలిబన్లు ఓ ప్రముఖ హోటల్పై చేసిన దాడిలో ఓ భారతీయుడు సహా తొమ్మిది మంది మరణించారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒక భారతీయులు, ఒక పాకిస్థానీ, కెనడా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఇద్దరేసి మహిళలు, ఓ పాకిస్థానీ మృతుల్లో ఉన్నారు. కాబూల్లోని సెరెనా హోటల్ మీద ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు ఈ కాల్పుల్లో గాయపడ్డారు.
ఈ దాడి చేసింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులు పిస్టళ్లతో వచ్చి, తాము భోజనానికి వచ్చినట్లు నటించారు. తర్వాత అక్కడ భోజనం చేస్తున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇంతకుముందు జనవరిలో కూడా విదేశీయులు ఉన్న రెస్టారెంటు మీద కాబూల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి మొత్తం 21 మందిని బలిగొన్నారు.
తాలిబన్ల దాడిలో భారతీయుడి మృతి
Published Fri, Mar 21 2014 3:09 PM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement
Advertisement