
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులతో పాటు పలువురు ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) సిబ్బందిని రాజధాని కాబూల్‌లో తాలిబన్లు కొద్ది గంటల పాటు నిర్బంధించారు. తర్వాత వారిని సురక్షితంగా వదిలేశారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సాంస్కృతిక, సమాచార శాఖ ఉప మంత్రి జబియుల్లా ముజాహిద్ చెప్పారు. నిర్బంధించిన వారిలో అఫ్గాన్‌లో చిరకాలంగా పని చేస్తున్న బీబీసీ మాజీ జర్నలిస్టు ఆండ్రూ నార్త్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూఎన్‌హెచ్‌సీఆర్ కోసం పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment