‘ఐరాస నివాసాలకు’ భారత్‌ నేతృత్వం | India to head UN habitat, Naidu chairs the general council meeting | Sakshi
Sakshi News home page

‘ఐరాస నివాసాలకు’ భారత్‌ నేతృత్వం

Published Tue, May 9 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

‘ఐరాస నివాసాలకు’ భారత్‌ నేతృత్వం

‘ఐరాస నివాసాలకు’ భారత్‌ నేతృత్వం

పాలక మండలికి వెంకయ్య సారథ్యం  
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సుస్థిర మానవ నివాసాల ఏర్పాటును ప్రోత్సహించే ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్‌–హాబిటాట్‌కు భారత్‌ రెండేళ్లపాటు నేతృత్వం వహించనుంది. కెన్యాలోని నైరోబీలో సోమవారం ప్రారంభమైన ఈ సంస్థ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధ్యక్ష స్థానానికి భారత్‌ ఏకగ్రీవంగా ఎన్నికైంది.

‘నూతన పట్టణ ఎజెండా – సమర్థవంతమైన అమలుకు అవకాశాలు’ అనే అంశంపై ఈ పాలక మండలి సమావేశం జరుగుతోంది. నైరోబీలో జరుగుతున్న ఈ సమావేశాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయు డు నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఈ సంస్థ చర్చలకు వెంకయ్యే నాయకత్వం వహిస్తారు. ‘సరికొత్త పట్టణ భవిష్యత్తుపై పనిచేసేందుకు దీన్ని అవకాశంగా భావిస్తున్నా’ అని వెంకయ్య ట్వీట్‌ చేశారు. యూఎన్‌–హాబిటాట్‌కు భారత్‌ నేతృత్వం వహించడం ఇది మూడోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement