కెన్యాలోని మందేరా పట్టణం మంగళవారం రక్తసిక్తమయ్యింది. రాతి గనుల్లో ఓ ఆగంతకుడు తన వద్ద నున్నతుపాకితో అతి కిరాతంగా కాల్పులకు పాల్పడ్డాడు
నైరోబి: కెన్యాలోని మందేరా పట్టణం మంగళవారం రక్తసిక్తమయ్యింది. రాతి గనుల్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు తన వద్ద నున్నతుపాకీతో కార్మికులపై అతి కిరాతంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 36 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. గనుల్లో కార్మికులు పని చేస్తున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి పాశవికంగా కాల్పులు జరిపినట్లు బాధితులు స్పష్టం చేశారు.
తమను ముస్లింలు, ముస్లిమేతరులుగా విడిగొట్టి కాల్పులు జరిపినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నైరోబీ పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహా ఘటనలో దేశంలో పేట్రేగి పోవడంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22 వ తేదీన ఒక బస్సు నైరోబికి వెళుతున్న సమయంలో హైజాక్ చేసి 28 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే.