పార్క్ నుంచి సింహాల ఎస్కేప్
నైరోబీ: పార్క్ నుంచి సింహాలు తప్పించుకోవడం కెన్యా రాజధాని నైరోబీలో కలకలం సృష్టించింది. నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న సింహాలు జనావాసంలోకి రావచ్చనే సమాచారంతో నైరోబీలో అలర్ట్ విధించారు. అయితే మొత్తం ఎన్ని సింహాలు బయటికి వెళ్లాయో స్పష్టమైన సమాచారం లేదు. ఇప్పటి వరకు ఒక ఆడ సింహాన్ని, రెండు సింహం పిల్లల్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరో రెండు సింహాలు తిరిగి నైరోబీ నేషనల్ పార్క్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఒకవేళ ఆ సింహాలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారలు తెలిపారు. ప్రజలెవ్వరూ బయటకు వెళ్లరాదని నైరోబీ వాసులను కోరారు. 2012లోనూ ఓసారి ఆడ సింహం పిల్లల్ని పార్క్‌లో వదిలి వెళ్లింది. అయితే అప్పట్లో ఆ ఆడ సింహాన్ని స్థానికులు చంపేశారు. అలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూడాలని జూ అధికారులు స్థానికులను హెచ్చరించారు.