Delaware
-
అమెరికాకు ప్రధాని మోదీ.. క్వాడ్ సందేశం విడుదల
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్లో జరగనున్న నాలుగో క్వాడ్ సదస్సుకు మోదీ హాజరవుతారు. అంతకంటే ముందు.. ఓ సందేశం విడుదల చేశారాయన. ‘‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం క్వాడ్ పాటుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగి క్వాడ్ సమావేశం పాల్గొనబోతున్నా. అలాగే.. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సమ్మిట్‌లో ప్రసంగం ఉండనుంది’’ అని ప్రకటన విడుదల చేశారాయన. మరోవైపు.. ప్రధాని మోదీ వివిధ సంస్థల సీఈవోలతోనూ భేటీ కానున్నారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for United StatesDuring his three-day visit to US, he will be attending the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he will hold some key bilateral meetings… pic.twitter.com/aAKqEmYhgc— ANI (@ANI) September 20, 2024 వాస్తవానికి.. క్వాడ్ సదస్సును ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్ అంగీకరించింది. ఈ క్వాడ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. డెలావేర్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. Today, I am embarking on a three day visit to the United States of America to participate in the Quad Summit being hosted by President Biden in his hometown Wilmington and to address the Summit of the Future at the UN General Assembly in New York. I look forward to joining my… pic.twitter.com/hvRrVtFSqv— ANI (@ANI) September 20, 2024ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. ‘మెరుగైన రేపటి కోసం.. బహుపాక్షిక పరిష్కారాలు’ అనేది ఈసారి సదస్సు థీమ్. ఈ సమ్మిట్‌లో పెద్ద సంఖ్యలో ప్రపంచ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. #WATCH | US: Preparation visuals from Nassau Veterans Memorial Coliseum in New York’s Long Island.Prime Minister Narendra Modi will meet the Indian diaspora here during a community event on September 22, during his 3-day US visit. pic.twitter.com/zvjA3cemEa— ANI (@ANI) September 21, 2024 -
Tesla: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!
టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. భారీ ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. The public vote is unequivocally in favor of Texas! Tesla will move immediately to hold a shareholder vote to transfer state of incorporation to Texas. https://t.co/ParwqQvS3d — Elon Musk (@elonmusk) February 1, 2024 అంతేకాదు.. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. ఆ పోల్‌లో 80 శాతం అవునని చెప్పడంతో.. మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు సైతం టెక్సాస్‌లోనే తమ కంపెనీలను రిజిస్టర్ చేసుకుంటాయి. పన్ను శాతం తక్కువగా ఉండడమే అందుకు కారణం. -
బీచ్‌లో బైడెన్ సందడి.. వైరల్‌గా ఫొటోలు
డెలావర్: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావర్ బీచ్‌లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ భార్య జిల్ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్తో కలిసి బీచ్‌లో కాసేపు సన్ బాత్ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. బీచ్‌కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్‌లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్‌లోని రెహోబాత్ బీచ్‌కు బైడెన్ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్ బాత్ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. -
ఒప్పంద ఉల్లంఘన.. చిక్కుల్లో ఎలన్ మస్క్!
డోవర్: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఆయన అధికారిక విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ మేరకు డెలావేర్(యూఎస్ స్టేట్) కోర్టుకు ట్విటర్ సమర్పించిన ఒక నివేదిక గురువారం బహిర్గతమైంది. ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ కొనుగోలుకు సంబంధించి వ్యవహారంలో ఫెడరల్ అధికారులు విచారణలో ఉన్నారు అని మైక్రోబ్లాగింగ్ సైట్ తరపు న్యాయవాది అక్టోబర్ 6వ తేదీన సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. అంతేకాదు.. మస్క్ తరపు న్యాయవాదులు, ఫెడరల్ అధికారులకు సహకరించాలని నెలల తరబడి అభ్యర్థించినప్పటికీ.. సానుకూలంగా స్పందించలేదని ట్విట్టర్ కోర్టుకు నివేదించింది. బంతిని దాచిపెట్టే ఈ ఆట ముగియాలి అంటూ ఆసక్తికరంగా ట్విటర్ ఆ ఫైలింగ్‌లో పేర్కొంది. Tesla CEO ఎలన్ మస్క్ ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చి.. సంచలనానికి తెర లేపాడు. అయితే జులైలో నకిలీ-స్పామ్ ఖాతాల సంఖ్య గురించి ఆందోళనలతో ఒప్పందానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి మరో సంచలనానికి దారి తీశాడు. అయితే.. ట్విటర్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందాన్ని బలవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. సదరు బిలియనీర్‌పై దావాతో ప్రతిస్పందించింది. ఇదీ చదవండి: ఈ వేస్టు దడ పుట్టిస్తోందిగా! -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్! నిజామా? లేక..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. మసాచుసెట్స్‌లోని సోమర్సెట్లో పాత బొగ్గ గని ప్లాంట్‌ను సందర్శించేందుకు బుధవారం వెళ్లారు బైడెన్. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ఎంత హాని జరుగుతుందో వివరించారు. చిన్నప్పుడు తల్లి తమను కారులో తీసుకెళ్లేదని, ఆ సమయంలో పరిశ్రమలనుంచి వెలువడే ఉద్గారాలు కారు లోపలికి రాకుండా విండ్‌షీల్డ్ వైపర్స్ ఎప్పుడూ ఆన్ చేసి ఉండేవని వివరించారు. ఈ పరిస్థితి వల్ల డెలావేర్లో తనతో పాటు పెరిగిన చాలా మంది క్యాన్సర్ బారినపడ్డారని వెల్లడించారు. క్యాన్సర్ రేటు డెలావేర్‌లోనే అత్యధికంగా ఉందని గుర్తు చేశారు. Did Joe Biden just announce he has cancer? “That’s why I — and so damn many other people I grew up with — have cancer.” pic.twitter.com/lkm7AHJATX — RNC Research (@RNCResearch) July 20, 2022 ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. బైడెన్‌కు క్యాన్సరా? ఆయనకు నయం కావాలని కోరుకుంటున్నాం అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో శ్వేతసౌధం దీనిపై క్లారిటీ ఇచ్చింది. బైడెన్‌కు ప్రస్తుతం క్యాన్సర్ లేదని చెప్పింది. అధ్యక్షుడు కావడానికి ముందే ఆయన చర్మ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. చదవండి: దొంగలముఠాను కత్తితో హడలెత్తించిన వ్యక్తి.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్.. గన్ లైసెన్స్‌పై డిబేట్! -
Elon Musk: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్‌లో ట్విస్ట్
డెలావేర్: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్‌పీఎఫ్. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం. మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్, ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చదవండి: ట్విటర్.. టెస్లా ఒక్కటి కాదు - బిల్‌గేట్స్ -
తొలిసారి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ పదవిని అధిరోహించిన తరువాత తొలిసారి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. వ్యాపార అవసరాల కోసం కాదు సుమా! వైట్ హౌస్‌లోని ఇంటికి కావాల్సిన జాబితా తయారు చేయడంలో తన భార్యకు సహకరించేందుకు డెలావర్‌లోని తన ఇంటికి బైడెన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో వెళ్ళారు. అధ్యక్షుడిగా తానీ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించడం తనకొచ్చిన గొప్ప అవకాశమని బైడెన్ వ్యాఖ్యానించారు. సహచరికి తోడ్పడేందుకే ‘‘నా మనవలు, మనవరాళ్ళను చూసేందుకు, అలాగే కొత్త ఇంటికి కావాల్సినవి కొనుగోలు చేయడంలో నా భార్య జిల్కి తోడ్పడేందుకు విల్మింగ్టన్కి దగ్గర్లోని నా ఇంటికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్ళాను’’అని బైడెన్ అన్నారు. మరోవైపు బైడెన్ కొడుకు హంటర్‌కి గురువారానికి 51 ఏళ్ళు నిండాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ప్రత్యేక ఏంటి? అమెరికా అధ్యక్షులంతా వాడేది ఎయిర్‌ఫోర్స్ వన్నే. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ‘‘అమెరికాకి చెందిన ఏ అధ్యక్షుడైనా, డెమొక్రాట్ కానీ, రిపబ్లికన్ కానీ ప్రయాణించేటప్పుడు ఎయిర్‌ఫోర్స్ వన్ నే ఉపయోగిస్తారు’’అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు. ఇంకాస్త బాగుంది కూడా.. డెలావర్‌లో లాండ్ అయిన వెంటనే బైడెన్ రిపోర్టర్లతో మాట్లాడుతూ చాలావరకు ఈ విమానం, తాను 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్ మాదిరిగానే ఉన్నదని చెప్పారు. కాకపోతే ఇది ఇంకాస్త బాగా ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేర్వేరుగా ప్రయాణం నిజానికి అమెరికాలో అధ్యక్షుడి భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సైతం ఒకే విమానంలో ప్రయాణించరు. వేర్వేరుగా ప్రయాణిస్తారు. అందుకు కారణం భద్రత దృష్ట్య ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు వారాల క్రితమే.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్‌లైన్స్ ప్రకారం ప్రయాణాలు కోవిడ్–19 వ్యాప్తిని ఉధృతం చేస్తాయని, ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెప్పిం ది. అయితే ఎవరైనా ప్రయాణాలు చేయదల్చుకుంటే మీ వంతు వచ్చాక, కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న తరువాతే ప్రయాణించాలని సీడీసీ స్పష్టం చేసింది. సెకండ్ డోస్ తీసుకున్న తరువాత కూడా ప్రయాణించడానికి రెండు వారాలు వేచి ఉండాలని సీడీసీ సూచించింది. అయితే బైడెన్ మూడు వారాల క్రితమే తన సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బైడెన్‌కి 78 ఏళ్ళ వయస్సు కావడం వల్ల ఆయన హైరిస్క్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం వల్ల ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రజలు మాత్రం బయటకు రాకుండా ఉండాలని వైట్ హౌస్ ప్రజలను అభ్యర్థించింది. తొలిసారి దశాబ్దకాలం పాటు సెనేట్‌లోనూ, 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్గానూ పనిచేసిన జోబైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. 2000 సంవత్సరంలో తొలిసారి బిల్‌క్లింటన్‌తో పాటు బైడెన్ దక్షిణాఫ్రికాకి ఈ విమానంలో ప్రయాణించారు. అప్పుడు మాదకద్రవ్యాల సరఫరాని అడ్డుకునే విషయంలో, కొలంబియాకి సహాయపడేందుకు 1.3 బిలియన్ డాలర్ల నిధులను బిల్‌క్లింటన్ ఆ సందర్భంగా ప్రకటించారు. -
సొంతూరు వీడుతూ బైడెన్ కంటతడి
న్యూ కేజల్ : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి వాషింగ్టన్కు బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన సొంత రాష్ట్రమైన డెలవార్ లోని న్యూ కేజల్‌లో నేషనల్ గార్డ్ సెంటర్లో మంగళవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న బైడెన్ తన సొంతూరు వీడి వెళ్లిపోతున్నందుకు పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. నేను చనిపోయినా కూడా నా గుండె డెలవార్ కోసం కొట్టుకుం టూనే ఉంటుందని బైడెన్ ఉద్విగ్నంగా చెప్పా రు. సెనేటర్‌గా దశాబ్దాల తరబడి రైల్లోనే వాషింగ్టన్కు ప్రయాణం చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికీ అలాగే వెళ్లాలనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా బైడెన్ విమానంలో వెళ్లాల్సి వచ్చింది. తన కోరిక తీరకపోయి నప్పటికీ ఆ రైలు ప్రయాణం అనుభూ తుల్ని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ‘‘సరిగ్గా పన్నెండేళ్ల క్రితం విల్మింగ్టన్ స్టేషన్లో ఒక నల్లజా తీయుడి కోసం వేచి ఉన్నాను. రైల్లో ఆయన వెళుతూ నన్నూ తీసుకొని వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షు లుగా ఒబామా, నేను ప్రమాణం చేశాము. ఇప్పుడు మళ్లీ ఒక నల్లజాతీయ మహిళను కలుసు కోవడానికి వాషింగ్టన్ వెళుతున్నాం. నేను, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపా«ధ్యక్షులుగా ప్రమాణం చేస్తాం. అదీ అమెరికా.. అదీ డెలవార్’’ అని బైడెన్ చెప్పారు. -
అబ్బాయి కోసం బాత్రూంలో కొట్లాట: విద్యార్థిని మృతి
విల్మింగ్టన్: హైస్కూలులో విద్యార్థినుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ 16 ఏళ్ల బాలిక మృతిచెందింది. ఈ సంఘటన విల్మింగ్టన్లో డీలవేర్లోని హోవర్డ్ హై స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో గురువారం చోటు చేసుకుంది. అయితే ఓ అబ్బాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణ చెలరేగడానికి కారణమని మిగతా విద్యార్థినులు తెలిపారు. బాధిత బాలిక బాత్ రూం వెళ్లిన సమయంలోనే కొట్లాట ప్రారంభమైందని మరో విద్యార్థిని చెప్పింది. బాధిత బాలిక, మరో బాలిక కలిసి ముందుగా కొట్లాడారు. అయితే తర్వాత అక్కడే ఉన్న మిగతా విద్యార్థినిలు అందరూ కలిసి ఒక్కసారిగా బాధిత బాలికపై పడి పిడిగుద్దులు గుద్దుతూ, అమె పై ఎగిరి దూకడంతో తీవ్రగాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కొట్లాటలో పాల్గొన్న విద్యార్థినులు ఎలాంటి మారణాయుధాలను ఉపయోగించలేదని స్కూల్ అధికారులు తెలిపారు. విద్యార్థినుల దాడిలో తీవ్రగాయాలైన బాలికను హెలీకాప్టర్‌లో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే బాలిక మృతి చెందింది. ఈ సంఘటనపై వీవో-టెక్నో స్కూల్ న్యూ క్యాస్టిల్ కౌంటీజిల్లా విద్యాశాఖ యంత్రాంగం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాలిక తల్లిదండ్రులకు తమ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు బృందాలు విచారణ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. విల్మింగ్టన్ మేయర్ డెన్నిస్ విలియమ్స్ బాలిక మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
అమెరికా ఉపాధ్యక్షుడి నివాసం వెలుపల కాల్పులు
డెలావర్: అమెరికా ఉపాధ్యక్షుడు జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు కలకలం రేపాయి. డెలావర్ లోని జోయి బిడెన్ నివాసం వెలుపల కాల్పులు జరిగినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. రాత్రి 8.25 గంటల ప్రాంతంలో ఓ వాహనంలో వచ్చిన దుండగులు రోడ్డుపై నుంచి కాల్పులు జరిపినట్టు పేర్కొంది. కాల్పులకు తెగబడింది ఎవరనే దానిపై అమెరికా భద్రతా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.