US President Joe Biden Relaxes At The Beach During His Latest Vacation In Delaware, Pics Viral - Sakshi
Sakshi News home page

Joe Biden Delaware Vacation Pics: బీచ్‌లో బైడెన్‌ సందడి.. వైరల్‌గా ఫొటోలు

Published Mon, Jul 10 2023 5:02 AM | Last Updated on Mon, Jul 10 2023 10:56 AM

US President Joe Biden Relaxes At The Beach During His Latest Vacation In Delaware - Sakshi

డెలావర్‌: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ డెలావర్‌ బీచ్‌లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్‌తో కలిసి బీచ్‌లో కాసేపు సన్‌ బాత్‌ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు.

బీచ్‌కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్‌లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్‌ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్‌లోని రెహోబాత్‌ బీచ్‌కు బైడెన్‌ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్‌ బాత్‌ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement