అమెరికాకు ప్రధాని మోదీ.. క్వాడ్‌ సందేశం విడుదల | Narendra Modi in US: PM to attend Quad summit UN Speech Other Details | Sakshi
Sakshi News home page

అమెరికాకు ప్రధాని మోదీ.. క్వాడ్‌ సందేశం విడుదల

Published Sat, Sep 21 2024 7:20 AM | Last Updated on Sat, Sep 21 2024 8:54 AM

Narendra Modi in US: PM to attend Quad summit UN Speech Other Details

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌‌లో జరగనున్న నాలుగో క్వాడ్‌ సదస్సుకు మోదీ హాజరవుతారు. అంతకంటే ముందు.. ఓ సందేశం విడుదల చేశారాయన.   

‘‘ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం క్వాడ్ పాటుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరిగి క్వాడ్‌ సమావేశం పాల్గొనబోతున్నా. అలాగే.. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ఫ్యూచర్‌ సమ్మిట్‌లో ప్రసంగం ఉండనుంది’’ అని ప్రకటన విడుదల చేశారాయన. మరోవైపు.. ప్రధాని మోదీ వివిధ సంస్థల సీఈవోలతోనూ భేటీ కానున్నారు.

 

వాస్తవానికి.. క్వాడ్ సదస్సును ఈ ఏడాది భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. అమెరికా చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహించేందుకు భారత్‌ అంగీకరించింది. ఈ క్వాడ్‌లో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. డెలావేర్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.
 


ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. ‘మెరుగైన రేపటి కోసం.. బహుపాక్షిక పరిష్కారాలు’ అనేది ఈసారి సదస్సు థీమ్. ఈ సమ్మిట్‌లో పెద్ద సంఖ్యలో ప్రపంచ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.

 

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement