టాటాకు పెంపుడు శునకం కన్నీటి బై బై | Ratan Tata's Dog Goa Meets Him For Last Time | Sakshi
Sakshi News home page

టాటాకు అంతిమ వీడ్కోలు పలికిన పెంపుడు శునకం ‘గోవా’

Published Thu, Oct 10 2024 6:48 PM | Last Updated on Thu, Oct 10 2024 8:25 PM

Ratan Tata's Dog Goa Meets Him For Last Time

ముంబయి: వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్‌10) సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం టాటాకు చివరిసారి వీడ్కోలు పలికారు. 

టాటాకు కడసారి బై బై చెప్పేందుకు వచ్చిన ఓ పెంపుడు శునకం ఈ అంత్యక్రియల్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ శునకం ఎవరిదో కాదు..రతన్‌ టాటా దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నదే. దీని పేరు గోవా. టాటా గోవా వెళ్లినపుడు ఓ వీధి శునకం ఆయన వెనకాల నడుస్తూ వచ్చింది. అంతే దాన్ని ముంబై తీసుకువచ్చి పెంచుకున్నారు. 11 ఏళ్లుగా గోవా టాటా వద్దే ఉంది. 

అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు టాటా పార్థివ దేహం పక్కనే కూర్చున్న గోవా తన మాస్టర్‌కు అశ్రనయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారందరికీ కన్నీళ్లు తెప్పించాయి.  

ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement