ప్రతీకాత్మక చిత్రం
ఉల్లి.. దాన్ని కోసేవారికి కన్నీరు రాక తప్పదు. ఎప్పుడూ కంటనీరు పెట్టని కఠిన హృదయులైనా ‘ఉల్లి’ ధాటికి కన్నీరు ఉబికి రావాల్సిందే. అయితే కంట నీరు రాకుండా ఉండే ఉల్లిని తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలే చేశారు. కొందరు సఫలమయ్యారు కూడా. 1980 నుంచి అమెరికాలోని వాషింగ్టన్, నెవడాలోని పంటపొలాల్లో పలు రకాల ఉల్లి జాతుల మధ్య సహజంగా సంకరం జరపడం వల్ల తాజాగా కొత్త రకం ఉల్లి ఆవిర్భవించింది.
దీని పేరే ‘సునియాన్’. జన్యుమార్పుల వల్లే ఇది రూపొందిందని చెబుతున్నారు. ఈ ఉల్లి తియ్యటి రుచి కలిగి ఉంటుందని, కోసినప్పుడు కన్నీరు రాదని పేర్కొంటున్నారు. సునియాన్ భారత్‌కు ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అనుకుంటున్నారా.. దానికి ఇంకాస్త టైం ఉంది లెండి!
Comments
Please login to add a commentAdd a comment