మయోసైటిస్‌ వల్ల నరకం.. కన్నీళ్లు పెట్టుకున్న సమంత | Samantha Emotional About Handling Her Health Issues In Yashoda Promotions | Sakshi
Sakshi News home page

Samantha : 'ప్రస్తుతానికి నేనింకా చావలేదు.. నా గురించి అలాంటి వార్తలు రాశారు'

Nov 8 2022 10:38 AM | Updated on Nov 8 2022 11:05 AM

Samantha Emotional About Handling Her Health Issues In Yashoda Promotions - Sakshi

ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనుకున్నా.. ఇంత వరకు వచ్చానా అని అనిపిస్తుంది..

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూనే చేతికి సెలైన్‌ పెట్టుకొని యశోద డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసిన సమంత తాజాగా ప్రమోషన్స్‌లోనూ స్వయంగా పాల్గొంది. ఈనెల 11న ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా అభిమానులు కూడా అనుకున్నారు. కానీ అందరిని ఆశ్వర్యపరుస్తూ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కష్టకాలాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 'ఒకానొక సమయంలో తాను ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనని అనిపించింది.  ఇప్పుడు ఆలోచిస్తే ఇక్కడివరకు ఎలా వచ్చానోనని అనిపిస్తుంది' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది.

తన అనారోగ్యం కూడా కొందరు తప్పుగా ప్రచారం చేస్తూ తాను ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు రాశారని, కానీ తాను ఇప్పటికి ఇంకా చావలేదు అంటూ ఎమోషనల్‌ అయ్యింది. అంతేకాకుండా తనలాగే ఎంతోమంది కష్టాలతో పోరాడుతున్నారని, తనది పెద్ద సమస్య కాదని, ఈ పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. కష్టకాలంలోనూ సమంత చూపిస్తున్న ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement