Samantha Open About Her Myositis Struggles at the Time Of Yashoda Movie Shooting - Sakshi
Sakshi News home page

Samantha: ఇంటర్వ్యూ ఇచ్చేందుకు కూడా ఓపిక ఉండేది కాదు: సమంత

Published Sat, Mar 25 2023 7:50 PM | Last Updated on Sat, Mar 25 2023 9:04 PM

Samantha Open About Her Myositis Struggles At the Time Of Yashoda Movie - Sakshi

సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది యశోద చిత్రంతో అభిమానులను పలకరించింది. ఆ సమయంలో  సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీ పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను పంచుకున్నారు. 

సమంత మాట్లాడుతూ.. 'మయోసైటిస్‌ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది.‌ అయినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొన్నా. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక ఉండేది కాదు. చాలా మందులు వాడాల్సి వచ్చేది. సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. అయితే ప‍్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. 

శాకుంతలం చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుణశేఖర్ కథ చెప్పగానే మొదట తిరస్కరించినట్లు తెలిపింది. అందుకు కారణం మూడేళ్లుగా తనలో ఉన్న భయమేనని అన్నారు. కానీ గుణశేఖర్ ఒప్పించి మరీ నటించేలా చేశారని వెల్లడించారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేక వ్యాయామాలు, వర్కవుట్‌లు, డైట్‌ కూడా మార్చుకున్నట్లు  వివరించారు. ఈ చిత్రాన్ని వదులుకుంటే తన కల సాకారమయ్యేది కాదన్నారు. కాగా.. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌, సచిన్‌ ఖేడ్కర్‌, మోహన్‌బాబు, అదితి బాలన్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement