స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయింది సమంత. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితంలో జరిగిన అంశాలపై పరోక్షంగా కామెంట్స్ చేసింది.
నా జీవితంలో ఇంత వరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. నా లైఫ్ తెరిచిన పుస్తకం. ఎత్తుపల్లాల్ని పారదర్శకంగా అందరూ చూడవచ్చు. కానీ కొందరిలో విషయాలను దాచిపెట్టడం, ఫేక్‌గా ఉండటం నాకు నచ్చవు. నేను అలా ఉండలేను అంటూ సామ్ పేర్కొంది.
అయితే ఈ వ్యాఖ్యలు నాగచైతన్యను ఉద్దేశించే చేసినవంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడ్డానని, గత రెండేళ్లలో అస్సలు ఊహించని పరిణామాలు, జీవిత పాఠాలు ఎదురయ్యాయని సమంత పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment