మేరీ విగ్రహం నుంచి రక్తం, కన్నీరు..!
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత చర్చిలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు
గుంటూరుపల్లి చర్చిలో వెలుగులోకి..
ఐనవోలు(వర్ధన్నపేట): వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత చర్చిలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు, రక్తం లాంటి ద్రవం కారుతుండ డంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆదివారం చర్చిలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, బుధవారం ఉదయం విగ్రహం కళ్లలోంచి రక్తంతో కూడిన కన్నీరు రావడాన్ని చర్చ ఫాదర్ గుర్తించారు.
ఈ విషయం ఇన్‌చార్జ్ బిషప్ జోసఫ్‌కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. సమీప గ్రామస్తులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేరీమాతను దర్శించుకుంటున్నారు.