Mary statue
-
మేరీ విగ్రహం నుంచి రక్తం, కన్నీరు..!
గుంటూరుపల్లి చర్చిలో వెలుగులోకి.. ఐనవోలు(వర్ధన్నపేట): వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత చర్చిలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు, రక్తం లాంటి ద్రవం కారుతుండ డంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఆదివారం చర్చిలో మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, బుధవారం ఉదయం విగ్రహం కళ్లలోంచి రక్తంతో కూడిన కన్నీరు రావడాన్ని చర్చ ఫాదర్ గుర్తించారు. ఈ విషయం ఇన్చార్జ్ బిషప్ జోసఫ్‌కు సమాచారం అందించగా ఆయన మేరీమాత విగ్రహాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. సమీప గ్రామస్తులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేరీమాతను దర్శించుకుంటున్నారు. -
మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు
ఇజ్రాయిల్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు వస్తోంది. నూనెలాంటి ద్రవం కంటి నుంచి కారడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఏడాది క్రితం కోరియాస్ కుటుంబం ఈ విగ్రహాన్ని తెచ్చుకుంది. అప్పటి నుంచి విగ్రహం మాములుగానే ఉన్నా .. అనూహ్యరీతిలో ఇప్పుడు ఇలా తడిగా మారుతోంది. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల వ్యాపించగా .. లెక్కలేనంతమంది చూసేందుకు తరలివస్తున్నారు. ఫొటోలు తీసుకుని మురిసిపోతున్నారు. తమ ఇంట్లో మేరీమాత ఇలా అద్భుతాన్ని చూపించడంతో కుటుంబసభ్యులు తెగ సంతోషపడుతున్నారు. -
వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు