Is Samantha Seeking Ayurvedic Treatment To Cure Myositis? - Sakshi
Sakshi News home page

మయోసిటీస్‌కు కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోనున్న సమంత!

Published Mon, Nov 28 2022 8:52 AM | Last Updated on Mon, Nov 28 2022 9:54 AM

Is Samantha Seeking Ayurvedic Treatment To Cure Myositis - Sakshi

నటి సమంత గురించి ఇటీవల రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె మయోసిటీస్‌ అనే వ్యాధికి గురికావడమే. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం కూడా లేదని నటి సమంతనే ఆ మధ్య స్వయంగా వెల్లడించారు. నటిగా దక్షిణాదిలో అగ్రస్థానంలో రాణిస్తున్న ఆమెకు ఇలాంటి వ్యాధా? ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

కాగా సమంత అమెరికాలో వైద్య చికిత్స పొందారు. ఆ వైద్యం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశం లేదని కొందరి సూచనల మేరకు సమంత కేరళలోని ఆయుర్వేద చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయుర్వేద చికిత్స సత్ఫలితాన్ని ఇస్తోందని, ఆమె త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని తాజాగా జరుగుతున్న ప్రచారం. త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటుందనే నమ్ముతున్నారు. దీనిపై సమంత సన్నిహితుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఇక ఆమె తాజాగా నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం నటుడు విజయ్‌ దేవరకొండతో ఖుషి అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం సమంతకు అనారోగ్యం కారణంగా ఆగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఖుషి చిత్రాన్ని పూర్తి చేస్తుందనే ఆశాభావంతో చిత్ర యూనిట్‌ ఎదురు చూస్తోంది.  
చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement