Ayurvedic treatment
-
భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపెట్టింది. తన ట్రీట్మెంట్లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. భూటాన్‌లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేద ట్రీట్మెంట్ బాగా ఫేమస్. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్‌లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించింది సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
గేదె పాలతో ఇలా చేస్తే నెలరోజుల్లోనే మచ్చలు తగ్గుతాయి
మంగుమచ్చలు.. చాలామందిని వేధించే సమస్య ఇది. ఎండలో తిరగడం వల్ల, వంశపారంపర్యంగా, హార్మోన్లలో సమతుల్యత లోపించడం వంటి వాటి వల్ల ఈ మచ్చలు ఏర్పడుతాయి. ముఖంపై ఈ నల్లని మంగుమచ్చలు చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తాయి. మరి ఎటువంటి కెమికల్స్ వాడకుండానే నేచురల్ పద్దతిలో మంచుమచ్చలను ఎలా తొలగించుకోవచ్చు? ఈ సింపుల్ టిప్స్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ► గేదె పాలను చిలికి తీసిన వెన్నను మంగుమచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి ► పచ్చి పసుపు, ఎర్రచందనం కలిపి పాలల్లో నూరి రాస్తే మంగు మచ్చలు తగ్గుతాయి ► జాజికాయను మేకపాలలో అరగదీసి రాయడం వల్ల రిజల్ట్ కనిపిస్తుంది ► పాలల్లో ఎర్ర కందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది ► పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే నెల రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది. ► టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మచ్చలు తగ్గి శరీర కాంతి మెరుగవుతుంది. ► కలబంద గుజ్జును మచ్చలపై పూయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చలు తగ్గి మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు పూర్తిగా తొలిగిపోతాయి. ► ఒక టీ స్పూన్ టొమాటో రసం, టీ స్పూర్ గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తానీ మట్టితో పేస్టులా చేసుకొని మచ్చలపై రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ► రోజ్‌వాటర్, కీరాదోస రసం, నిర్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఒక్క నెలలోనే చక్కటి మార్పు కనిపిస్తుంది. ► ఆలుగడ్డ పొట్ట తీసి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండిరసం తీయాలి. దీన్ని దూదిలో నానబెట్టి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి. డా.నవీన్ రాయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు -
కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోనున్న సమంత!
నటి సమంత గురించి ఇటీవల రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందుకు కారణం ఆమె మయోసిటీస్ అనే వ్యాధికి గురికావడమే. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం కూడా లేదని నటి సమంతనే ఆ మధ్య స్వయంగా వెల్లడించారు. నటిగా దక్షిణాదిలో అగ్రస్థానంలో రాణిస్తున్న ఆమెకు ఇలాంటి వ్యాధా? ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. కాగా సమంత అమెరికాలో వైద్య చికిత్స పొందారు. ఆ వైద్యం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశం లేదని కొందరి సూచనల మేరకు సమంత కేరళలోని ఆయుర్వేద చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయుర్వేద చికిత్స సత్ఫలితాన్ని ఇస్తోందని, ఆమె త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని తాజాగా జరుగుతున్న ప్రచారం. త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటుందనే నమ్ముతున్నారు. దీనిపై సమంత సన్నిహితుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇక ఆమె తాజాగా నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం నటుడు విజయ్ దేవరకొండతో ఖుషి అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం సమంతకు అనారోగ్యం కారణంగా ఆగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఖుషి చిత్రాన్ని పూర్తి చేస్తుందనే ఆశాభావంతో చిత్ర యూనిట్ ఎదురు చూస్తోంది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే? -
Health: పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? ఉడికించిన పప్పు తింటే
Health Tips In Telugu: మన జీవన శైలి సరిగా లేకపోవడం వలన వచ్చే అనారోగ్యమే మలబద్ధకం. నిజం చెప్పాలంటే దీనికి మందు లేదు. కానీ పరిష్కారాలున్నాయి. మలబద్దకం నివారణ- పరిష్కారాలు 1. రోజూ అరగంట నుంచి గంట పాటు మంచి వ్యాయామము చేయండి. 2. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. 3. దుంప కూరలు, వేపుడు కూరలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్‌లు పూర్తిగా పక్కన పెట్టండి. తేలికగా జీర్ణమయ్యే భోజనం తినండి. ఉడికించిన పప్పు కూడా తినవచ్చు. 4.ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, మంచినీరు తక్కువ తాగడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి గల జీవన శైలి, థైరాయిడ్, కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల మందులు అతిగా వాడడం వల్ల మలబద్ధకం వస్తుంది. 5. ఆహారం లో పండ్లు, కూరగాయలు చేర్చుకోవడం. కూరలు, తాజా పళ్ళు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే వ్యాయామము ఎంత చేస్తే అంత త్వరగా మల బద్దకం నుంచి బయటపడతారు. 6. నీళ్లు కూడా బాగా తాగండి. రోజూ 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తీసుకోవడం మంచిది. 7. ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చేసే పనులు ప్రశాంతంగా, నిదానంగా చేయండి. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాలనుకోవడం, ఏదీ సరిగా చేయలేకపోతే ఒత్తిడికి గురికావడం లాంటి వాటికి దూరంగా ఉండండి. 9. ఏవైనా ఇతరత్రా వ్యాధులు ఎక్కువ రోజులు ఉన్నట్టయితే మీ సమస్యను డాక్టర్లు తో చర్చించండి. ఒక దానికొకటి తోడయినట్టు సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి? 1. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఆపిల్ తినండి. 2. తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ సముద్రపు ఉప్పు కలిపి తాగండి. ఒక అరగంటలో మోషన్స్ అవుతాయి. అసలు వద్దు మీ సమస్యని బట్టి నెలకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే చేయండి. అంతకు మించి పాటించరాదు. మీకు వీలుంటే ఒక 15 రోజులు మంచి ప్రకృతి ఆశ్రమంలో గడపండి. మీకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. తెలిసీ తెలియక ఉన్న చాలా ఇతర రోగాలు కూడా పోతాయి. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. చదవండి: Diabetes- Best Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా? -
గొంతు నొప్పి చాలా రోజుల నుంచి ఉందా? కారణాలు ఇవే
గొంతు నొప్పి ఉంటే చాలు, దానికి జలుబుకు ఆపాదించుకొని యాంటీబయాటిక్స్ మింగుతుంటారు. కొంతమందిగాని అది సరైన పద్ధతి కాదు. గొంతు నొప్పికి కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే.. 1. అంగిటి_ముల్లు (టాన్సిలైటిస్) జలుబుకు కారణమైన వైరస్ క్రిములు గొంతు నొప్పిని కూడా కలిగించే అవకాశం ఉంది. బయట వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్లు శరీరంలోనికి ప్రవేశించేటప్పుడు గొంతు లోపల ఇరుపక్కలా ఉండే టాన్సిల్స్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ను వైరస్ క్రిముల వల్లనే రావాలని లేదు; బ్యాక్టీరియా వాళ్ళ కూడా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో టాన్సిల్స్ మీద చీముతో కూడిన తెల్లని పొక్కులు కనిపిస్తాయి. తీవ్రస్థాయిలో జ్వరం వస్తుంది. ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. దీనిని 'కాంచనార గుగ్గులు' వంటి గ్రంథులమీద పని చేసే మందులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. అసలు టాన్సిల్స్ అనేవి లేకపోతే వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తే ఉండదు. అనే భావనతో కొంతమంది టాన్సిలెక్టమీ కోసం డాక్టర్ మీద ఒత్తిడి తీసుకువస్తుంటారు కానీ ఇది సరైన భావన కాదు. టాన్సిల్ అడ్డుగా కనుక లేకపోతే ఇన్ఫెక్షన్ నేరుగా శరీరంలోకి ప్రవేశించి గుండె మొదలైన ముఖ్యమైన అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో పరిష్కారాలు : 1. పటిలను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతుకు తగిలేలా పుక్కిట పట్టాలి. 2. త్రిఫలాచూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కషాయం కాచి పుక్కిట పట్టాలి. 3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి. ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం. గ్లాండ్యులర్_జ్వరం: ఎప్ స్టీన్ - బార్ వైరస్ వల్ల కలిగే గ్లాండ్యులర్ ఫీవర్ లో దీర్ఘకాలం పాటు టాన్సిల్స్ వాపు ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన కొత్తలో టాన్సిల్స్ నొప్పి మొదలై చాలా రోజుల పాటు ఏ మందులకూ లొంగకుండా అలాగే ఉండిపోతుంది. దీనితోపాటు ఎడతెగని ఒళ్లు నొప్పులు, నీరసం, అనుత్సాహం వంటి శారీరక లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనిని అశ్వగంధ, విష్ణుప్రియ వంటి 'ఇమ్యునో మాడ్యులేటింగ్' మూలికలతో చికిత్సించాల్సి ఉంటుంది. ఔషధాలు: అశ్వగంధాదిలేహ్యం, అమృతప్రాశఘృతం, చ్యవనప్రాశాలేహ్యం, కూష్మాండలేహ్యం, నారాసింహఘృతం, విదార్యాదిఘృతం, సుకుమారరసాయనం. గొంతులో ఆహారేతర పదార్ధం: కొంతమంది మాంసాహారం తినేటప్పుడు అలవాటుగా బొమికలను కూడా తింటుంటారు. ఒకవేళ వీటిని సరిగా నమలకుండా కనుక తిన్నట్లయితే అవి గొంతు లోపల గుచ్చుకొని గాయమై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే, కొన్ని సందర్భాల్లో బొమికల ముక్కలు, చేపలముళ్లు గొంతులో ఇరుక్కొని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. వైద్య సహాయంతో వీటిని తొలగించాల్సి ఉంటుంది శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫీలియా): కొంతమందిలో ఏ ఇన్ఫెక్షనూ లేకపోయినప్పటికీ గొంతు నొప్పి వస్తుంటుంది. ఎలర్జీలు దీనికి ప్రధానమైన కారణం. సిగరెట్ పొగ, పాత పుస్తకాల వాసన, దుమ్ము, ధూళీ అవసరాలని మించి మాట్లాడటం వంటి కారణాల మూలంగా ఎలర్జీ ఏర్పడి గొంతు లోపలి మ్యూకస్ పొర ఇరిటేట్ అవుతుంది. తత్కారణంగా గొంతునొప్పి వస్తుంది. కారణాలను జాగ్రత్తగా తరచి చూసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఔషధాలు: దశమూలారిష్టం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మకరధ్వజ మాత్రలు, స్వచ్ఛంద భైరవ రసం, తాళీసాది చూర్ణం, బాహ్యప్రయోగాలి - చంద్రకళా లేపం, రాస్నాది చూర్ణం, కర్పూరాది తైలం. ఆమ్లపిత్తం (ఎసిడిటి /హార్ట్ బర్న్): అజీర్ణం, ఎసిడిటి, గ్యాస్ వంటి కారణాల వల్ల అమాశయంలో ఉండాల్సిన ఆమ్ల పదార్ధం అన్న నాళిక ద్వారా గొంతులోనికి ఎగదన్ని అక్కడ నొప్పినీ, మంటనూ కలిగించే అవకాశం ఉంది. దీనికి ఆయుర్వేద శాస్త్రం సూచించిన 'ఆమ్లపిత్త హర చికిత్సలు" చేయాల్సి ఉంటుంది. టీ, కాఫీ, సిగరెట్ల వంటి వాటిని మానేసి పాలు వంటి సాత్వికాహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 1. ఆహారం కొద్దిమొత్తాలలో తినాలి. 2. కారం, పులుపు, మసాలాలు తగ్గించాలి. 3. ధూమపానం మద్యపానాలు పనికిరావు. 4. బరువు తగ్గాలి. 5. ఆహారం విషయంలో సమయపాలన పాటించాలి. ఆయుర్వేదంలో సలహాలు : 1. పిల్లిపీచర గడ్డలను పొడిచేసి, అరచెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 2. ఉసిరికాయ పెచ్చులను పొడిచేసి అరచెంచాడు మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. 3. అతి మధురం వేరును పొడిచేసి పావు చెంచాడు మోతాదుగా పాలతో కలిపి తీసుకోవాలి. 4. తిప్పసత్తును రేగు గింజంత మోతాదుగా చన్నీళ్లతో లేదా తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఔషధాలు: సంశమనీవటి, అవిపత్తికర చూర్ణం, ధాత్రీలోహం, కామధుఘరసం, శంఖ భస్మం, సూతశేఖర రసం, ప్రవాళ పంచామృతం, సుకుమార ఘృతం. కంటసుధరకవటి ఉపయోగాలు : గొంతు నొప్పి , జలుబు, దగ్గు, గొంతులో గరగర, గురక రావటం డా.నవీన్ నడిమింటి, హోమియో వైద్యులు -
Health Tips: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం..
Cervical Spondylosis- Ayurvedic Treatment: మెడ నొప్పి బాధిస్తోందా? మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? సర్వైకల్ స్పాండిలోసిస్ అని డాక్టర్ చెప్పారా? మెడ ప్రాంతంలోని వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి పడి, భుజం లోపలకు నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. దీనిని ’గ్రీవాస్థంభం’ అలోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అటువంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది. తప్పితే భుజాన్ని కదిలించడంలోగాని, తిప్పడంలోగాని ఇబ్బంది ఏదీ ఉండదు. సమస్య భుజంలో కాకుండా మెడలో ఉంటుంది కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ కు చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. సలహాలు : 1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కషాయంకాచి రెండు చెంచాల కశాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి. 4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి. 5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. సింహనాదగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం. ఈ జాగ్రత్తలు పాటిస్తూనే కావాల్సినంత విశ్రాంతి, శరీర జాగ్రత్తలు, పరిమితంగా వ్యాయామాలు చేస్తే తొందరగా నొప్పి తగ్గుతుంది. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి.. Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
Health Tips: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..
విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్లు గట్టిగా ఉంటూ, పగటి పూట శారీరక కదిలికలతో ఎక్కువయ్యే కీళ్ల నొప్పిని ’సంధివాతం’ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్‌గా పిలిచే ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోయి కదిలికలు కష్టమైపోతుంది. వృత్తి రీత్యా చేసే వివిధ రకాల పనులే కాకుండా, వంశపారంపర్యత, జన్మసంబంధ నిర్మాణ లోపాల వంటి ఎన్నోకారణాల వల్ల ఈ తరహా నొప్పి ప్రాప్తిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ‘అతియోగం’. జాయింటును పరిధికి మించి, అవధికి మించి వాడటం. దీనికి చికిత్స రెండు రకాల ప్రయోజనాలను ఆశించి జరుగుతుంది. ఎముక అరుగుదలను పరిరక్షించడం మొదటి ప్రయోజనమైతే నొప్పిని తగ్గించి కదిలికలను తీసుకురావటం రెండో ప్రయోజనం. ఔషధాలు: ప్రవాళ భస్మం, మోతీ భస్మం వంటిని ఎముకల అరుగుదలను నిలువరిస్తే, వాత విధ్వంసినీ రసం వంటి మందులు నొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. జాయింటు నొప్పితో పాటు సాదారణారోగ్యం దెబ్బతింటే దానిని ’ఆమ వాతం’ అంటారు. ‘రుమటాయిడ్ అర్తరైటిస్’ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలతో సరిపోతాయి. ఈ వ్యాధిలో జాయింట్ల అరుగుదల ఉండదుగాని ఆమం ప్రకోపించడం చేత విపరీతమైన నొప్పి అనిపిస్తుంది. శాస్త్రకారుడు ఈ నొప్పి అనే లక్షణాన్ని ’వృశ్చికా దంశం’తో పోలుస్తాడు. తేలు కాటుతో సమానమైన నొప్పి అని దీనర్థం. మగవారిలో కంటే ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్వీయరక్షక వ్యవస్థ వ్యత్యస్థంగా మారడాన్ని (ఆటో ఇమ్యూనిటీ) దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిలో వ్యాధి తగ్గినట్లే తగ్గి దానంతట అదే తిరగబడుతూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఆయుర్వేద పంచకర్మలతో పాటు ఇతర శమన చికిత్సలు చక్కని ఫలితాలను ఇస్తాయి. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ, ఆహార, విహార చికిత్సలను అన్నిటినీ ఇందులో ప్రయోగించాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే భుజాలు కూడా ఇన్ ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. జలుబు వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా జాయింట్లలో వాపునుకలిగించే అవకాశం ఉంది. జర్మన్ మీజిల్స్, మధుమేహం, హైపటైటిస్ వంటి వ్యాధులు సైతం భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రుమాటిక్ ఫీవర్ లో కూడా భుజం నొప్పి. ఇతర కీళ్ల నొప్పులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. గనోరియా ఉంటే, దానికి పూర్తి చికిత్స తీసుకోనట్లయితే, సూక్ష్మక్రిములు జాయింట్లను చేతి నొప్పిని కలిగిస్తాయి. జాయింటు పైన చీము గడ్డలు లేచినప్పుడు ఇన్ఫెక్షన్ చర్మం నుంచి లోనికి వ్యాపించి భుజం నొప్పిని కలిగించవచ్చు. ఔషధాలు: క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), లోహాసవం, మహారస్నాదిక్వాథ చూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, రాస్నాది క్వాథ చూర్ణం, స్వర్ణ వాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు, బాహ్య ప్రయోగానికి అమవాత తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్దన తైలం, విషముష్టి తైలం అనేవి వాడాలి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
Health Tips: మాట్లాడేటపుడు నత్తి వస్తోందా? ఈ చిట్కాలు పాటించారంటే!
నత్తి మాట్లాడుతున్నారా? ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలున్నాయి? మనసు సరిగానే చెబుతుంది కానీ నోట్లో మాట అనుకున్నట్టు రాదు. నలుగురిలో ఉన్నపుడు నత్తి మాట్లాడే వాళ్లలో అభద్రతాభావం, మొహమాటం పెరిగిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ చెప్పాలంటే నత్తిని తగ్గించాలి. అందుకు ఆయుర్వేదంలో ఉన్న పద్ధతులు ఇవి. పద్ధతి -1 కావాల్సినవి వసకొమ్ము చిన్న ముక్క తేనె చేయాల్సిన పద్ధతి గంధపు సాన మీద నీళ్ళు చిలకరించి వస కొమ్మును చాది గంధం తీయాలి. దానికి తేనె కలిపి నత్తి వున్నవాళ్లకు రోజుకు 3 , 4 సార్లు నాలుక పై రాయాలి. ఈ విధంగా కొంత కాలం చేస్తే ఎంత కఠిన మైన పదాలనైన సులభంగా పలకగలరు . పద్ధతి - 2 కావాల్సినవి పసుపుకొమ్ము కాల్చిన పొడి పొంగించిన పటిక పొడి పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకొని చప్పరించాలి. ఇది కొన్ని రోజుల పాటు చేయాలి. పద్ధతి - 3 కావాల్సినవి సరస్వతి సమూల చూర్ణం-50 గ్రాములు నానబెట్టి , ఎండబెట్టిన వస చూర్ణం -50 గ్రాములు నేతిలో వేయించిన శొంటి చూర్ణం- 50 గ్రాములు దొరగాయించిన పిప్పళ్ళ చూర్ణం- 50 గ్రాములు పటికబెల్లం- 50 గ్రాములు అన్నింటిని విడివిడిగా వస్త్రఘాలితం చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి. ఉదయం , సాయంత్రం పరగడుపున తీసుకోవాలి. చిన్న పిల్లలకు చిటికెడు , పెద్ద పిల్లలకు పాటు టీ స్పూను , పెద్దవాళ్ళకు సగం టీ స్పూను తేనెతో కలిపి ఇవ్వాలి. జ్ఞాన ముద్ర లేదా సరస్వతి ముద్రను వేయాలి. 10 రోజుల లోపే ఎంతో మార్పు కనబడుతుంది. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
హై బీపీ.. హెవీ బ్లడ్ ప్రెషర్.. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అధిక రక్తపోటును నిశ్శబ్ద కిల్లర్‌గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు, లక్షణాలు లేకుండా వస్తుంది కాబట్టి చాలామందికి రక్త పోటు యొక్క ప్రమాద సూచిక అసలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా.., తరచుగా తట్టుకోలేనంత కోపం వచ్చినా, శరీరంలో తేడా అనిపించినా.. కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది. సోడియం లెవల్ సాధారణంగా ఒక లీటర్ రక్తంలో 135 నుంచి 145 మిల్లీ ఈక్వెలంట్స్ మధ్య ఉంటుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారు రోజువారీ సోడియం 1,500 మిల్లీగ్రాములకు పరిమితం చేయాలి, ఇది తప్పకుండా పాటించాల్సిన మొదటి జాగ్రత్త. ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2,400 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఆ మేరకు అంచనా వేసుకోవాలి. వెంటనే ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కారంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో సోడియం తగ్గడం వల్ల రక్తపోటు నార్మల్కు వస్తుంది. ఎందుకంటే, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల శరీర అసమతుల్యతతోపాటు ఉబ్బరం ఏర్పడుతుంది. ఎందుకంటే శరీరం ఉప్పును బయటకు పంపడానికి అదనపు నీటిని నిల్వ చేస్తుంది. ఇది తరచుగా శరీరంలో రక్తపోటును ప్రేరేపిస్తుంది. దీంతో అరోగ్య సమస్యలు మొదలువుతాయి. అందుకే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. అందువల్ల రక్తపోటును తగ్గించే ఏకైక మార్గం ఆహారంలో ఉప్పును తగ్గించడమే. రక్తపోటు స్థాయిలను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఆహార పదార్థాలు ఇవి. అరటిపండ్లు ఇవి పొటాషియానికి గొప్ప మూలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఖనిజంగా పొటాషియం పనిచేస్తుంది. పొటాషియం, సోడియం 2:1 నిష్పత్తిగా ఉంటేనే శరీరంలో రక్తపోటు స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అరటిపండ్లను తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. నేరుగా తినవచ్చు లేదా బనానా షేక్, స్మూతీని తయారు చేసుకోని తిన్నా ఫరావాలేదు. మెగ్నీషియం కోసం బియ్యం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం, వోట్స్ లాంటివి మెగ్నీషియంకు మంచి వనరులు. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మెగ్నీషియం నైట్రిక్ ఆక్సైడ్ ధమని గోడలను సడలించి, రక్తం సాఫీగా ప్రవహించేలా చేయడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 500 మిల్లీగ్రామ్ నుంచి 1,000 మిల్లీగ్రామ్ వరకు మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాల ఉత్పత్తులు తాజా లేదా ఇంట్లో తయారుచేసిన పాల ఉత్పత్తులను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ఎముకలు, దంతాలలో భారీ మొత్తంలో కాల్షియం నిల్వ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం రక్త నాళాలు విస్తరించడానికి, సంకోచించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం తగ్గితే హృదయనాళ వ్యవస్థ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో కాల్షియం పొందేందుకు శరీరం ఇతర వనరుల కోసం వెతకడం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. మీ ఆహారంలో పాలు, జున్ను, పెరుగు, మజ్జిగ వంటి కాల్షియం అధికంగా ఉండే వాటిని ఉండేలా చూసుకుంటే, ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి సోడియం పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. లెవల్స్‌లో తేడా ఉంటే డాక్టర్‌ను కలిసి ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడంతో పాటు ధ్యానం, యోగా లేదా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Thyroid Cancer: థైరాయిడ్ క్యాన్సర్.. మహిళలతో పోలిస్తే పురుషులకే ముప్పు ఎక్కువ! లక్షణాలివే -
Health Tips: సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? ఇలా చేశారంటే..
మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందా? తలనొప్పి మరియు జలుబు తగ్గడం లేదా? ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? సైనస్ సమస్య ఉంటే ఏకాగ్రత ఉండదు. సరైన నిద్ర ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే సరిగా గాలి కూడా పీల్చుకోలేము. శాశ్వతంగా కాదు గానీ, కొన్ని పద్దతుల ద్వారా ఉపశమనం మాత్రమే లభిస్తుంది. సైనస్... ►తరచుగా పార్శ్య తలనొప్పి ►ముక్కు కొద్దిగా వంకరగా ఉండటం ►మన రెండు కళ్ళు చూసే రెండు వేర్వేరు విషయాలను కలపడంలో మెదడు ఇబ్బంది పడడం వల్ల నొప్పి ►ముక్కు దూలం కొంచెం వంగి ఉండటం ►ముక్కులో సైనస్ గ్రంధులు దుమ్ము వల్ల ఉబ్బడం ఎలాంటి చికిత్సలున్నాయి? ►ముక్కు శస్త్ర చికిత్స ►ముక్కులో సైనస్ గ్రంధులు తొలగింపు ►ప్రాణాయామంలో అనులోమ విలోమ పద్దతి ►హోమియో లో ఎస్ ఎస్ మిక్చర్ అనే మందు రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు తీసుకోవడం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 1. వీలైనంత వరకు ఘాటైన వాసనలకు, కాలుష్యానికి దూరంగా ఉండడం 2. చలి గాలికి, వర్షంలో తడవకుండా జాగ్రత్త తీసుకోవడం 3. జీర్ణశక్తి మెరుగుపరచుకోవడం, మలమూత్రాదులు ఏ రోజుకా రోజు క్రమ పద్ధతిలో శరీరంనుంచి బయటకు పూర్తిగా వెడలిపోయేలా చూసుకోవడం. అంటే అజీర్తి అనే సమస్యను లేకుండా చేసుకోవడం. ఆయుర్వేదంలో ఏం పరిష్కారాలున్నాయి? 1. వేపపొడి నీటిలో కలిపి పరగడుపున త్రాగడం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమస్యలు అదుపులో ఉంటాయి. 2. తుమ్ములు, జలుబు లాంటివి బాగా ఎక్కువగా ఉంటే ముక్కులో వేపనూనె ఓ రెండు చుక్కలు వేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. (కానీ వేపనూనె వల్ల కలిగే మంట కొన్ని నిముషాలు నరకం చూపిస్తుంది.) 3. నీటిలో వేపనూనె లేదా పసుపు లాంటివి వేసి, బాగా మరగబెట్టాక వచ్చే ఆవిరిని పట్టడం. దీనికి మంచి వ్యాపరైజర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4. మందు బిళ్ళలు, యాంటీబయాటిక్ లాంటివి తక్కువగానే వాడడం మేలు. ఎందుకంటే అవి సమకూర్చే సౌకర్యాల కంటే తెచ్చిపెట్టే ఇబ్బందులే ఎక్కువ. 5. గొంతు గరగరలు ఎక్కువగా ఉంటే తేనె, కషాయం, గోరువెచ్చని నీటితో గార్గ్లింగ్ లాంటివి ఉపశమనం కలిగిస్తాయి. 6. సరిపడినంత నిద్ర, తగినంత నీరు త్రాగడం 7. పెరుగు, వేరుశనగపప్పు, కాఫీ లాంటి వాటి వాడకం తగ్గించడం 8. నిత్యం వ్యాయామం, నడక 9. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం లాంటివి చేస్తే అధికంగా తయారయ్యే మ్యూకస్ తొలగిపోయే అవకాశం ఉంది. 10. జలనేతి కూడా మంచి సాధనమే. ఒక ముక్కులోనుంచి పంపిన ఉప్పు నీరు మరో ముక్కునుంచి బయటకు వచ్చేలా చేయడం. తదనంతరం గట్టిగా గాలి వదులుతూ ముక్కులు పొడిగా అయ్యేట్లు చేయడం. ఇక్కడ ఉదహరించినవి అన్నీ స్వయంగా ప్రయత్నించి ఫలితాలను వరుసక్రమంలో బేరీజు వేసుకుని చెప్పినవే. మీరు వాడే ముందు మీ శరీర ధర్మాలను బట్టి అనుసరిస్తే మేలు. అందరికీ ఒకేలా పని చేస్తాయని చెప్పలేం కదా! ఇవేవీ శాశ్వతంగా సమస్యను దూరం చేయలేవు. కేవలం కాలంతోపాటు మన శరీర ధర్మాలు, రోగనిరోధకశక్తి మారే తీరు మాత్రమే ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించగలదు. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయర్వేద వైద్యులు చదవండి: Steamed Food- Health Benefits: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే! How To Control BP: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇవి తగ్గిస్తే.. -
లంపీ చర్మ వ్యాధి..: సంప్రదాయ చికిత్స
పశువుల చర్మంపై గడ్డల మారిదిగా వచ్చే ప్రాణాంతక వ్యాధి పేరు లంపీ చర్మ వ్యాధి. ఈ వ్యాధి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గో సంతతికి సోకింది. గత నెలలో గుజరాత్లో 5 జిల్లాల్లో 1,229 పశువులకు సోకింది. 39 పశువులు ప్రాణాలుకోల్పోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రైతులకు ఇంటిపట్టున దొరికే సంప్రదాయ దినుసులతో కూడిన ఆయుర్వేద చికిత్సా పద్ధతులను రైతులకు అందుబాలోకి తెచ్చింది. లంపీ చర్మ వ్యాధి చికిత్సకు 2 పద్ధతులున్నాయి. 1) తినిపించే మందు: లంపీ చర్మ వ్యాధి చికిత్స కోసం సంప్రదాయ దినుసులతో నోటి ద్వారా తినిపించే మందు తయారు చేసే పద్ధతులు రెండు ఉన్నాయి. మొదటి విధానం: ఈ చికిత్సలో ఒక మోతాదుకు అవసరమయ్యే పదార్థాలు: తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా తయారు చేయాలి. తయారు చేసిన పేస్ట్‌కు తగినంత బెల్లం కలిపి పశువుకు తినిపించాలి. మొదటి రోజున ఇలా తాజాగా తయారు చేసిన ఒక మోతాదు మందును ప్రతి 3 గంటలకోసారి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి.. రెండు వారాల పాటు.. రోజుకు మూడు సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తాజాగా తయారు చేసిన మందును తినిపించాలి. రెండవ విధానం: లంపీ చర్మ వ్యాధికి సంప్రదాయ పద్ధతిలో మందును రెండు మోతాదులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వెల్లుల్లి 2 పాయలు, ధనియాలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, తులసి ఆకులు గుప్పెడు, బిరియానీ ఆకులు పది గ్రాములు, మిరియాలు పది గ్రాములు, తమలపాకులు 5, ఉల్లిపాయలు చిన్నవి రెండు, పసుపు పది గ్రామలు, నేలవేము ఆకుల పొడి 30 గ్రాములు, కృష్ణ తులసి ఆకులు గుప్పెడు, వేపాకులు ఒక గుప్పెడు, నేరేడు ఆకులు ఒక గుప్పెడు.. ఇంకా బెల్లం వంద గ్రాములు. ఈ మందును కూడా ప్రతి సారీ తాజాగా తయారు చేయాలి. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి, దానిలో బెల్లం కలపాలి. మొదటి రోజు ప్రతి 3 గంటల కోసారి తాజా మందు తయారు చేసి పశువుకు తినిపించాలి. రెండో రోజు నుంచి ప్రతిరోజూ మందును తాజాగా తయారు చేసి రోజుకు రెండుసార్లు చొప్పున పొద్దున్న, సాయంత్రం పశువు స్థితి మెరుగుపడే వరకు తినిపించాలి. 2) గాయంపై రాసే మందు: లంపీ చర్మం జబ్బు సోకిన పశువు చర్మంపై గాయం ఉంటే గనక, అందుకోసం ప్రత్యేకంగా సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేసి పై పూతగా పూయాలి. కావలసిన సామగ్రి: కుప్పింటాకులు 1 గుప్పెడు, వెల్లుల్లి పది రెబ్బలు, వేపాకులు ఒక గుప్పెడు, కొబ్బరి లేదా నువ్వుల నూనె 500 మిల్లీ లీటర్లు. పసుపు 20 గ్రాములు, గోరింటాకు ఒక గుప్పెడు, తులసి ఆకులు ఒక గుప్పెడు. తయారు చేసే విధానం.. అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయాలి. దానిలో 500 మిల్లీ లీటర్ల కొబ్బరి లేదా నువ్వుల నూనె కలిపి మరిగించి, తర్వాత చల్లార్చాలి. రాసే పద్ధతి: గాయాన్ని శుభ్రపరచి దాని మీద ఈ మందును రాయాలి. గాయం మీద పురుగులు గనక ఉన్నట్లయితే.. సీతాఫలం ఆకుల పేస్ట్ లేదా కర్పూరం, కొబ్బరి నూనె కలిపి రాయాలి. National Dairy Development Board యూట్యూబు ఛానల్లో లంపీ చర్మ వ్యాధికి చికిత్సపై తెలుగు వీడియో అందుబాటులో ఉంది.. ఇలా వెతకండి.. Ethno-veterinary formulation for Lumpy Skin Disease-Telugu. -
తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స!
భోపాల్ : ఓ ఐపీఎస్ అధికారి తన తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స చేయించిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డీజీపీని ఆదేశించింది. వివరాలు.. మధ్యప్రదేశ్ ఏడీజీ(అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) రాజేంద్ర మిశ్రా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి కేఎం మిశ్రా(84)ను భోపాల్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో కేఎం మిశ్రా జనవరి 14న మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశాయి. అయితే తన తండ్రి మరణించలేదని భావించిన రాజేంద్ర మిశ్రా.. ఆయన శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఆయుర్వేద చికిత్స చేయించడం ప్రారంభించారు. మిశ్రా ఇంటికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవలే కొంత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో ఇంట్లో జరుగుతున్న ఈ తతంగం గురించి బయటపడింది. దీని గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించిగా...ఇది పూర్తిగా తమ సొంత విషయమని, తమ ఇంట్లోకి వచ్చే అధికారం ఎవరికీ లేదని మిశ్రా మీడియాను అడ్డగించారు. కాగా ఈ విషయం గురించి మీడియాలో ప్రసారం కావడంతో మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అల్లోపతిక్, ఆయుర్వేదిక్ వైద్య నిపుణులతో ఓ కమిటీ వేసి... ఈ వ్యవహారాన్ని తక్షణమే తేల్చాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. ఈ విషయం గురించి తమకు నివేదిక అందజేయాలని పేర్కొంది. -
నడుంనొప్పి ఆయుర్వేద చికిత్స
నేటి జీవన విధానంలో ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం.. అంటే రాత్రివేళ నిద్ర పోకపోవడం, పగటిపూట నిద్రపోవడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైనది నడుంనొప్పి. ఈ రోజుల్లో 40 ఏళ్లకే నడుంనొప్పి వస్తోంది. ఆయుర్వేద శాస్త్రం నడుంనొప్పికి ‘గృధ్రసీవాతం’గా నామకరణంచేసింది. తొంభైశాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నడుంనొప్పి బారినపడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమయింది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్ర వాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు.. ఈ కారణాల వల్ల వాత ప్రకోపం ఏర్పడి, ముందుగా పిరుదులపై భాగాన స్తబ్థతను, నొప్పిని కలిగించి ఆ తరువాత నడుంభాగం, ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి వస్తుంది. డిస్కులో వచ్చేమార్పులు: వెన్నుపూసల మధ్య ఉంటే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డిస్కుకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది లక్షణాలు: నడుంనొప్పి, వాపు, కాస్త శ్రమించినా సూదులతో గుచ్చినట్లుగా నొప్పి తీవ్రం కావడం, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆయుర్వేద చికిత్స: నడుంనొప్పి సమస్యకు ఆయుర్వేద శాస్త్రం సూచించిన సమగ్రమైన చికిత్సాపద్ధతుల్లో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్స అని మూడు ప్రధానమైనవి ఉన్నాయి. శమన చికిత్సలు: వ్యాధి తాలూకు దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు వంటి ఔషధాలు రోగికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ శమన చికిత్స వల్ల ఒక్కోసారి ప్రకోపించిన దోషాలు మళ్ళీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతోపాటు కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. కటివస్తి: ఇది ఆయుర్వేదంలోని ఒక విశిష్ఠ ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థి (కార్టిలేజ్)కి రక్తప్రసరణ పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ చికిత్స అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ వస్తికర్మ చిన్న పేగులు, పెద్దపేగులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం ముఖ్యం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుంనొప్పి సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. డా.మనోహర్ ఎం.డి(ఆయుర్వేద) స్టార్ ఆయుర్వేద -
స్త్రీలలో సంతానలేమి - ఆయుర్వేద చికిత్స
జీవితంలో ప్రతి స్త్రీ మాతృత్వం పొందటాన్ని మధురానుభూతిగా భావిస్తుంది. అలాగే పురుషుడు పితృత్వపు అనుభూతిని ఆకాంక్షిస్తాడు. ఆయుర్వేదశాస్త్రంలో పిల్లలు పుట్టకపోవటానికి, తల్లిదండ్రుల యొక్క శుక్ర, శోణితాలు... అందలి దోషాలే ముఖ్య కారణాలని ఆయుర్వేదాచార్యులు ఎప్పుడో చెప్పారు. కాని సంతానలేమికి ఇప్పటికీ చాలామంది... స్త్రీలలోనే లోపం ఉందని చెబుతున్నారు. సంతానం కలగకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులైన దంపతులు, ఏ విధమైన గర్భనిరోధక మాత్రలు లేకుండా ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు దాంపత్య జీవితం గడిపినా పిల్లలు పుట్టకపోతే దానిని సంతానలేమిగా పరిగణించవచ్చు. సంతానలేమికి ప్రధాన కారణాలు : ఋతుచక్రంలో మార్పులు కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం. గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను... పుట్టుకతో వచ్చే లోపాలు గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్ఫెక్షన్స్ గర్భాశయంలో గడ్డలు కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబ్స్ మూసుకొనిపోవటం, ట్యూబ్స్‌లో వాపు ఏర్పడటం. ఆయుర్వేద శాస్త్రం గర్భధారణలో నాలుగు ప్రధాన అంశాలు ప్రస్తావించింది 1. ఋతువు: సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుండి 16 వ రోజు వరకు ఋతుకాలంగా పరిగణిస్తాం. 12 నుండి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా ఋతుకాలంగా పరిగణిస్తాం. (సాధారణంగా 21 - 35 సంవత్సరాల వరకు) 2. క్షేత్రం: కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. 3. అంబు: గర్భపోషణకు ఉపయోగపడే పోషకాలు, గర్భాధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేదం వర్ణించింది. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి. 4. బీజం: ఆయుర్వేదంలో పురుషుల్లోని వీర్యాన్ని ‘బీజం’ అనే పదంతో సూచించారు. అండం పరిమాణం, శక్తి, శుక్ర కణంలో కదలగలిగే సామర్థ్యం, శుక్రకణం నాణ్యత మీద గర్భధారణ ఆధారపడి ఉంటుంది. సంతానలేమికి ఆయుర్వేద చికిత్స : ఆయుర్వేద శాస్త్రంలో త్రిదోషాల ప్రాధాన్యతను బట్టి, ఔషధసేవన చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రసాయనాలు ఇందులో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇలాగే పంచకర్మలు... ముఖ్యంగా స్నేహ, స్వేద, విరేచన, వస్తి కర్మలు అవసరాన్ని బట్టి చేయవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణతలు... ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోని పిచు, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధ యుక్త కషాయాల) లాంటి శాస్త్రీయ చికిత్సా విధానాలు, చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినవి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించవలసి ఉంటుంది. డాక్టర్ కరుణశ్రీ, ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, Ph: 8977 336688 -
డయాబెటిస్‌కి ఆయుర్వేద చికిత్స
ఎవరు చెప్పారు! డయాబెటిస్ జీవితాంతం సమస్య అని. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద మీ కొరకు తీసుకుని వచ్చింది ప్రపంచ ప్రామాణికమైన అత్యున్నత వైద్యం. దీనితో మీ సమస్యలు పరిష్కారం. ఈరోజు భారతదేశంలో ప్రతి వందమందిలో 14 మంది డయాబెటిస్ బారినపడుతున్నారు. నిత్యం వాడే షుగరు వ్యాధి నిరోధక పాశ్చాత్య రసాయనాలు చర్మం మీదమచ్చలు తలనొప్పి, జీర్ణ సంబంధిత బాధలు మరియు అవాంఛిత ప్రక్రియలు కలుగుతాయి. ఆయుర్వేదం ఎంత ప్రాభవమైనదో, అంత శాశ్వతమైనది. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చింది. ప్రకృతిలో ఉన్న వనమూలికల నుంచి 36 సం॥అనుభవం తో లక్షలమంది పేషెంట్లకు ఉపశమనం కలిగించిన మందులు ఇప్పుడు మీ అందుబాటులోకి వచ్చింది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారు. ఇది అనువంశీకమా లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? రోగ లక్షణాలకు మీ వ్యాధి తీవ్రతకు మా నైపుణ్యాలైన డాక్టర్లు ఆమూలాగ్రం పరిశీలించి, మీకు మందులు ఇవ్వబడతాయి. ఈ మందులు మొదలుపెట్టాక వాటిని మెల్లమెల్లగా పాశ్చత్య రసాయనిక మందులు తగ్గించబడతాయి. ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందులు వలన మీకు సరికొత్త జీవితం ఖాయం. డయాబెటిస్‌ను వ్యాధిగా భావించండి. ఎందుకు అంటే అది కేవలం మీరు చేయవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి దానిని కంట్రోలులో ఉంచడమేకాదు. ప్రిడయాబెటిస్ చికిత్స (Prediabetes treatment)తో పూర్తిగా తగ్గించవచ్చు. ఉదా॥అత్యాధునిక స్టార్ ఆయుర్వేద మందులతో పాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం, ఉప్పు, చక్కర సంబంధిత పదార్థాలు తగ్గించడం. మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. సంప్రదాయత, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు 36 సం॥నిపుణులైన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో మీకు అందుబాటులో ఉన్నారు. డయాబెటిస్ గురించి బాధపడకండి. దానిని మీరు సరైన శ్రద్ధతో కంట్రోలులో ఉంచుకోకపోతే మెల్లిమెల్లిగాఅది మీ శరీరాన్ని కదిలిస్తుంది. 5000 సం॥ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పుడు స్టార్ ఆయుర్వేదంలో అత్యాధునిక టెక్నాలజీ రూపంలో మీ సేవకై వచ్చింది మా స్టార్ ఆయుర్వేద. ఈ వ్యాధి దుష్పలితాలు విపరీతంగా దాహం పెరగడం మూత్రవిసర్జన పెరగడం విపరీతంగా ఆకలివేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవడం, బలహీనంగా అనిపించడం బరువు తగ్గి చిక్కిపోవడం, నీరసం, నిస్సత్తువ చూపు మందగించడం, మబ్బుగా, మసకగా కనిపించడం విపరీతమైన అలసట కాళ్ళు లాగటం ఏదైనా దెబ్బలు తగిలినా త్వరగా తగ్గకపోవడం కొన్ని సం॥తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్ళు, చేతులలోని రక్తనాళాలలో దెబ్బతినడం చిన్న రక్తనాళాలు దెబ్బ తిన్నందువల్ల కంటిలోని రెటీనా దెబ్బతినడం నరాల బలహీనత, కళ్ళ మంటలు మానసిక, సెక్స్ సమస్యలు డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక. ph: 8977 33 66 88 www.starayurveda.com -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనడం, పగలు నిద్రించడం మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదంలో స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక. ph: 8977 33 66 88 www.starayurveda.com -
నడుమునొప్పి -ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్యం అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. -
సంధివాతం :ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స
ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆయుర్వేదశాస్త్రంలో వాతదోష ప్రధాన వ్యాధిగా పరిగణిస్తారు. దీన్ని ‘సంధివాతం’ అని ఆచార్యులు వర్ణించారు. సామాన్య పరిభాషలో కీళ్లు అరిగిపోయాయని చెప్పే ఈ సమస్య 40-45 ఏళ్లు పైబడ్డ వారిలో సాధారణంగా వస్తుంటుంది. ముఖ్యంగా ఆ వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎముకలు ఒకదానికి మరొకటి ఒరుసుకోవడం (రాపిడి) వల్ల కీళ్లలో నొప్పి వస్తుంది. సరిగా నడవలేక, జీవితం దుర్భరమవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఒకసారి వస్తే అది తగ్గదనే అభిప్రాయం ఉంది. కానీ అది సరైనది కాదు. మానవ శరీరంలో ఒక రక్షణవ్యవస్థ (డిఫెన్స్ మెకానిజమ్) పనిచేస్తుంది. దీన్నే ఆయుర్వేదంలో ‘వ్యాధిక్షమత్వశక్తి’ (రోగ నిరోధకశక్తి)గా పరిగణిస్తారు. సమస్య చిన్నది అయితే శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుంటుంది. వ్యాధి తీవ్రత (దోష బలం) ఎక్కువ అయితే మరమ్మతు వీలుకాదు. అప్పుడు మోకాలి కీలు, తుంటి కీలు ఉబ్బినట్లు (వాపు) అవుతాయి. కీలు లోపల సున్నితమైన పొర ఉంటుంది. దీన్నే శ్లేషక కల అంటారు. అక్కడ శ్లేషక కఫం ఉత్పత్తి అయి, కీళ్ల సాధారణ కార్యం జరుగుతుంది. వాత ప్రకోపం వల్ల శ్లేషక కఫంతో శ్లేషక కల అరిగిపోయి సంధివాతం వస్తుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీన్ని డీ-జనరేటివ్ మార్పుగా పరిగణిస్తారు. ఆయుర్వేద చికిత్స పద్ధతులు ఆయుర్వేద శాస్త్రంలో సంధివాతానికి (ఆస్టియో ఆర్థరైటిస్)మూడు పద్ధతుల ద్వారా చికిత్స చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యాధి మూలకారణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఉదాహరణకు పగటినిద్ర, రాత్రిళ్లు మేల్కొని ఉండటం వంటి అంశాలకు దూరంగా ఉండాలి. ఆహార నియమాలు: సరైన సమయానికి సంతులిత ఆహారం తీసుకోవడం, కాల్షియం అవసరమైతే ఆహారంలో వెన్న శాతం లేని పాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం, విశ్రాంతి కూడా అవసరం. శమనశోధన చికిత్సలు: శమనం అంటే దోషాలను శమించే ఔషధాలను సేవించడం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వాతప్రధాన దోషం కనుక దానికి శమనంగా అస్థి ధాతువు (ఎముక) బలానికి అవసరమైన ఔషధాలు వాడాలి. ఆయుర్వేదంలో అలాంటివి కషాయాలు, లేహ్యాలు, తైలాల రూపంలో అభ్యమవుతున్నాయి. అయితే వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడినట్లయితే వేదన, వాపు లాంటి లక్షణాలనుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో వారు ఇక తమ దైనందిన కార్యాలలో చురుగ్గా పాల్గొనే అవకాశం పెరుగుతుంది. స్నేహకర్మ (అభ్యంగన), స్వేదకర్మ వల్ల కీళ్లలో మంచి మృదుత్వాన్ని సాధించవచ్చు. అలాగే వస్థికర్మ, స్థానిక ధారా, జానువస్తి లాంటి పంచకర్మల వల్ల రోగికి సత్వర ఉపశమనం కలిగించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ (సంధివాత) లక్షణాలు ఈ సమస్య వచ్చినప్పుడు కీళ్లలో వాపు, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో తీవ్రమైన బాధ కలుగుతుంది. కీలుభాగాన్ని సులభంగా కదిలించలేరు. కీళ్ల వద్ద రాపిడి శబ్దం వస్తుంది. శరీర కదలికలు జరిగినప్పుడు వేదన ఎక్కువవుతుంది. సమస్య తీవ్రత పెరిగినకొద్దీ కీళ్ల భాగాలు ఉబ్బుతాయి. వాపు వస్తూ పోతూ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల (ముఖ్యంగా చలికి), అలాగే వ్యాయామ సమయంలో కూడా వేదన పెరుగుతుంది. {పారంభదశలో బాధ, బిగుసుకుపోవడం (లాకింగ్) ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్‌కు చేరినదశలో హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. - డాక్టర్ రమణరాజు (ఎం.డి. ఆయుర్వేద) స్టార్ ఆయుర్వేద సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ఫోన్ : 7416 107 107 / 7416 109 109 www.starayurveda.com -
పాదాల వాపు తగ్గేదెలా..?
నా వయసు 62. రెండు నెలలుగా తరచూ కాళ్లు, పాదాలలో కొద్దిపాటి వాపులు వస్తున్నాయి. నీరసంగా కూడా ఉంటోంది. పదేళ్లుగా మధుమేహానికి చికిత్స తీసుకుంటున్నాను. రక్తపోటు సక్రమంగానే ఉంది. డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి, గాబరా పడాల్సిందేమీ లేదన్నారు. దయచేసి ఈ సమస్యకు ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన. - సుగుణమ్మ, వరంగల్ గుండెజబ్బులు, కిడ్నీసమస్యలు, నెత్తురు తక్కువగా ఉండటం వంటి సందర్భాల్లో మీరు చెప్పిన వాపులు కనపడతాయి. చికరాల మధుమేహ వ్యాధిలో కూడా కొన్ని ఉప్రదవాలు ఉంటాయి. వాటిలో కాళ్లవాపులు కూడా ఒకటి. మీరు రాసినదాన్ని బట్టి ప్రత్యేకమైన వ్యాధులేమీ లేనట్లుగా కనబడుతోంది. ఈ కింది మందులు ఒక నెలపాటు వాడి ఫలితాన్ని పరిశీలించండి. గోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చంద్రప్రభావటి ( మాత్రలు ) ఉదయం ఒకటి, రాత్రి ఒకటి = శిలాజిత్వాటివటి (మాత్రలు )ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. వీలుంటే ‘తిప్పతీగె’ ఆకులు, కాండాన్ని దంచి, కషాయం కాచుకుని 30 మి.లీ. ఉదయం, రాత్రి ఖాళీ కడుపున తాగండి. తేలికపాటి వ్యాయామం చేయండి. కూర్చున్నప్పుడు కాళ్లను కాస్త ఎత్తుగా ఉంచాలి. ప్రాణాయామం రెండుపూటలా చేయండి. మా బాబు వయసు ఏడేళ్లు. గత నాలుగు నెలలుగా ముఖం మీద గోధుమరంగు మచ్చలు వస్తున్నాయి. చర్మంపై కీళ్ల దగ్గర చిన్నపొక్కుల్లాగ కనపడుతున్నాయి. ఆహారం తక్కువగా తింటాడు. సరియైన ఆయుర్వేద చికిత్స సూచింపగలరు. - లలిత, నిడదవోలు మీరు చెప్పినదాన్ని బట్టి బాబుకి విటమిన్ ‘ఎ’ అనే పోషకాహారం లోపించినట్లుంది. ఆహారంలో మునగకాడలు, మునగాకులు (లేతవి) వండి తినిపించండి. తాజాఫలాలలో దానిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి వంటివి చాలా మంచిది. అన్నిరకాల ఆకుకూరలు, క్యారట్, బీట్రూట్ మొదలైనవి బాగా ఇవ్వండి. బయటి ఆహారం తినకుండా చూడండి. చాక్లెట్లు, ఐస్‌క్రీములు, శీతలపానీయాల జోలికి పోవద్దు. బరువు 15 కిలోలు ఉండేట్లు, నెత్తురు సక్రమ పరిధిలో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కింది మందులు ఒక రెండు నెలల పాటు వాడండి. ఆరోగ్యవర్థని (మాత్రలు) రోజుకి ఒకటి విడంగారిష్ట, అవవిందాసవ ద్రావకాలను, ఒక్కొక్క చెంచా గ్లాసులో పోసుకుని, రెండు చెంచాల నీళ్లు కలిపి, రెండుపూటలా ఏదైనా తిన్న తర్వాత తాగించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
సయాటికా (గుద్రసీ వాతము)
ప్రస్తుత పరిస్థితిలో మానవుని జీవితము చాల యాంత్రికముగా మారిపోయింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, దినచర్య, స్వప్న విపర్యయము (పగతి నిద్ర, రాత్రి సమయానికి నిద్రపోకపోవటం) లాంటి విషయాలలో అనేక మార్పులు రావటం వలన. ఆందోళన, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల వలన మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో అతి ముఖ్యమైనది (నడుమునొప్పి) కటిశూల. నూటికి 90 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ నడుమునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఆయుర్వేదశాస్త్రంలో చరక, నూశ్రత, వాగ్భటులు ఈ సమస్యను గుద్రసీ వాతం (సయాటికా)గా పేర్కొంటూ ఎంతో విపులంగా వివరించారు. దీనికి సాధారణ కారణాలు పరిశీలించి చూసినట్లయితే... ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చొనుట, స్థూలకాయం, అధికశ్రమతో కూడిన పనులు ఎక్కువసేపు చేయటం, అధిక బరువులను మోయటం, ఎక్కువదూరం ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించటం, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వలన, కొన్ని వంశపారంపర్య వ్యాధుల వలన, మరికొన్ని రోడ్డు ప్రమాదాల వలన ఈ నడుమునొప్పి సమస్య వస్తుంటుంది. ముఖ్యంగా పైన వివరించిన కారణాల వలన శరీరంలో వాతప్రకోపం జరిగి, ముందుగా పిరుదులకు పైభాగాన స్తబ్ధతను, నొప్పిని కలిగించి తరువాత కటి ప్రదేశం (నడుము), తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాలలో క్రమంగా నొప్పి కలుగుతుంది. దీనినే గుద్రసీ వాతము (సయాటికా) అని అంటారు. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఎల్4-ఎల్5, ఎస్1-ఎస్2 వెన్నుపూసల మధ్యగల సయాటికా అనే నరంపై ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఆయుర్వేద చికిత్స ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు సమగ్రమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అందులో 1. శమన చికిత్స. 2. శోధన చికిత్స. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదన, కాయకంగా ఔషధాలు ఉంటాయి. అలాగే వాతహర చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి మళ్లీ వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సాపద్ధతి ఉంది. ఈ చికిత్సా పద్ధతి ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. 1. స్నేహకర్మ: ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి, తద్వారా జాయింట్స్‌లో కదలికలను తేలికగా చేయవచ్చును. 2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్‌ను మృదువుగా అయ్యేటట్లు చేయవచ్చును. కటివస్తి: ఈ పద్ధతి ఈ వ్యాధిలో అతి విశిష్టతను సంతరించుకున్నది. ఈ ప్రక్రియ ద్వారా అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి తద్వారా నొప్పి తీవ్రతను తగ్గించవచ్చును. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే విశిష్ట చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదేవిధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. జాగ్రత్తలు: సరి అయిన పోషక ఆహారాలు తీసుకోవడం, నిదాన పరివర్జనం అనగా పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీమళ్లీ చేయకుండా జాగ్రత్త పాటించినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చును. డిస్క్‌లో వచ్చే మార్పులు ఈ వ్యాధిలో వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి డిస్క్ మీద ఒత్తిడి పెరగటం, వాపు రావటం లేదా డిస్క్కి రక్తప్రసరణ సరిగా లేకపోవటం, అరిగిపోవటం అనే సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్క్‌లో వాపు వస్తే దానిలో ఉండే చిక్కని ద్రవం బయటకు వచ్చి మేరుదండం లేదా దాన్నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి కలిగించటం వల్ల నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుములో నొప్పి కలగటం, వాపు, కొంచెం శారీరక శ్రమ చేయగానే నొప్పి తీవ్రత పెరగటం, ఈ నొప్పి సూదులతో గుచ్చినట్లుగా, ఒక్కోసారి తిమ్మిర్లు, మంట తో కూడి ఉంటుంది. సమస్య తీవ్రమైనది అయితే స్పర్శహాని కూడా కలుగవచ్చు. ఒక్కోసారి మలమూత్రాల మీద నియంత్రణ కూడా పోయే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పి బాధ అనగానే సాధారణంగా పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కల్గుతుంది. కాని మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. కావున ఇలాంటి సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి, జాగ్రత్తపడటం వల్ల ఈ వ్యాధిని సమూలంగా తగ్గించవచ్చు. డాక్టర్ కరుణశ్రీ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 9908911199 / 9959911466 -
నడుము నొప్పి - ఆయుర్వేద చికిత్స
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వలన, ఈరోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్యలు, స్వప్న విపర్య అంటే రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుము నొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గుద్రసీవాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎపుడో ఒక్కసారి నడుము నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కారణాలు: ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయటం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల ముఖ్యంగా వాత ప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుముభాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది. నడుము నొప్పికి ఆయుర్వేద చికిత్స నడుము నొప్పి అనే సమస్యకు ఆయుర్వేద శాస్త్రంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే మూడు ప్రధానమైనవి. నిదాన పరివర్జనము: నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: విరుద్ధ ఆహార - విహారసేవన. (రాత్రి మేల్కొనుట, పగలు నిద్రించుట మొదలైనవి) శమన చికిత్స: వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు ఇత్యాది ఔషధాలు రోగికి ఇవ్వబడతాయి. కానీ, ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు, కొందరికి పంచకర్మ (శోధన చికిత్స) కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను (వాత, పిత్త, కఫ) సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును. ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్ళను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేవులు, పెద్దప్రేవులలోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకునిరావచ్చును. జాగ్రత్తలు: అవసరమైన పోషకాహారం తీసుకుంటూ, వ్యాధి తిరిగి రాకుండా వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. డిస్క్‌లో వచ్చే మార్పులు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌లో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది. డాక్టర్ మనోహర్ ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 7416 101 101 / 7416 102 102 www.starayurveda.com