Health Tips In Telugu: How To Get Relief From Arthritis Tips By Ayurvedic Expert - Sakshi
Sakshi News home page

Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..

Published Wed, Sep 28 2022 4:36 PM | Last Updated on Wed, Sep 28 2022 5:47 PM

Health Tips: How To Get Relief From Arthritis Tips By Ayurvedic Expert - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశ్రాంతిగా ఉన్నప్పుడు కొయ్యబారినట్లు గట్టిగా ఉంటూ, పగటి పూట శారీరక కదిలికలతో ఎక్కువయ్యే కీళ్ల నొప్పిని ’సంధివాతం’ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్‌గా పిలిచే ఈ వ్యాధిలో ఎముకలు అరిగిపోయి కదిలికలు కష్టమైపోతుంది. వృత్తి రీత్యా చేసే వివిధ రకాల పనులే కాకుండా, వంశపారంపర్యత, జన్మసంబంధ నిర్మాణ లోపాల వంటి ఎన్నోకారణాల వల్ల ఈ తరహా నొప్పి ప్రాప్తిస్తుంది.

దీనికి ప్రధానమైన కారణం ‘అతియోగం’. జాయింటును పరిధికి మించి, అవధికి మించి వాడటం. దీనికి చికిత్స రెండు రకాల ప్రయోజనాలను ఆశించి జరుగుతుంది. ఎముక అరుగుదలను పరిరక్షించడం మొదటి ప్రయోజనమైతే నొప్పిని తగ్గించి కదిలికలను తీసుకురావటం రెండో ప్రయోజనం. 

ఔషధాలు:
ప్రవాళ భస్మం, మోతీ భస్మం వంటిని ఎముకల అరుగుదలను నిలువరిస్తే, వాత విధ్వంసినీ రసం వంటి మందులు నొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. 
జాయింటు నొప్పితో పాటు సాదారణారోగ్యం దెబ్బతింటే దానిని ’ఆమ వాతం’ అంటారు.
‘రుమటాయిడ్ అర్తరైటిస్’ లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలతో సరిపోతాయి.
ఈ వ్యాధిలో జాయింట్ల అరుగుదల ఉండదుగాని ఆమం ప్రకోపించడం చేత విపరీతమైన నొప్పి అనిపిస్తుంది. 

శాస్త్రకారుడు ఈ నొప్పి అనే లక్షణాన్ని ’వృశ్చికా దంశం’తో పోలుస్తాడు. తేలు కాటుతో సమానమైన నొప్పి అని దీనర్థం. మగవారిలో కంటే ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్వీయరక్షక వ్యవస్థ వ్యత్యస్థంగా మారడాన్ని (ఆటో  ఇమ్యూనిటీ) దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిలో వ్యాధి తగ్గినట్లే తగ్గి దానంతట అదే తిరగబడుతూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఆయుర్వేద పంచకర్మలతో పాటు ఇతర శమన చికిత్సలు చక్కని ఫలితాలను ఇస్తాయి. 

ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ, ఆహార, విహార చికిత్సలను అన్నిటినీ ఇందులో ప్రయోగించాల్సి ఉంటుంది. శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే భుజాలు కూడా ఇన్ ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంది. జలుబు వంటి వైరస్ ఇన్ఫెక్షన్లు తాత్కాలికంగా జాయింట్లలో వాపునుకలిగించే అవకాశం ఉంది.

జర్మన్ మీజిల్స్, మధుమేహం, హైపటైటిస్ వంటి వ్యాధులు సైతం భుజం నొప్పిని కలిగించే అవకాశం ఉంది. అలాగే రుమాటిక్ ఫీవర్ లో కూడా భుజం నొప్పి. ఇతర కీళ్ల నొప్పులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. గనోరియా ఉంటే, దానికి పూర్తి చికిత్స తీసుకోనట్లయితే, సూక్ష్మక్రిములు జాయింట్లను చేతి నొప్పిని కలిగిస్తాయి. జాయింటు పైన చీము గడ్డలు లేచినప్పుడు ఇన్ఫెక్షన్ చర్మం నుంచి లోనికి వ్యాపించి భుజం నొప్పిని కలిగించవచ్చు. 

ఔషధాలు:
క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), లోహాసవం, మహారస్నాదిక్వాథ చూర్ణం, మహాయోగరాజ గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, రాస్నాది క్వాథ చూర్ణం, స్వర్ణ వాత రాక్షసం, త్రయోదశాంగ గుగ్గులు, రాక్షసం, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు, బాహ్య ప్రయోగానికి అమవాత తైలం, ధన్వంతర తైలం, క్షీరబలా తైలం, కుబ్జ ప్రసారిణి తైలం, మహామాష తైలం, నారాయణ తైలం, ప్రభంజన విమర్దన తైలం, విషముష్టి తైలం అనేవి వాడాలి.
-డా.నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు

చదవండి: High Uric Acid Level: యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement