ప్రతీకాత్మక చిత్రం
నత్తి మాట్లాడుతున్నారా? ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలున్నాయి? మనసు సరిగానే చెబుతుంది కానీ నోట్లో మాట అనుకున్నట్టు రాదు. నలుగురిలో ఉన్నపుడు నత్తి మాట్లాడే వాళ్లలో అభద్రతాభావం, మొహమాటం పెరిగిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ చెప్పాలంటే నత్తిని తగ్గించాలి. అందుకు ఆయుర్వేదంలో ఉన్న పద్ధతులు ఇవి.
పద్ధతి -1
కావాల్సినవి
వసకొమ్ము చిన్న ముక్క
తేనె
చేయాల్సిన పద్ధతి
గంధపు సాన మీద నీళ్ళు చిలకరించి వస కొమ్మును చాది గంధం తీయాలి.
దానికి తేనె కలిపి నత్తి వున్నవాళ్లకు రోజుకు 3 , 4 సార్లు నాలుక పై రాయాలి.
ఈ విధంగా కొంత కాలం చేస్తే ఎంత కఠిన మైన పదాలనైన సులభంగా పలకగలరు .
పద్ధతి - 2
కావాల్సినవి
పసుపుకొమ్ము కాల్చిన పొడి
పొంగించిన పటిక పొడి
పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకొని చప్పరించాలి. ఇది కొన్ని రోజుల పాటు చేయాలి.
పద్ధతి - 3
కావాల్సినవి
సరస్వతి సమూల చూర్ణం-50 గ్రాములు
నానబెట్టి , ఎండబెట్టిన వస చూర్ణం -50 గ్రాములు
నేతిలో వేయించిన శొంటి చూర్ణం- 50 గ్రాములు
దొరగాయించిన పిప్పళ్ళ చూర్ణం- 50 గ్రాములు
పటికబెల్లం- 50 గ్రాములు
అన్నింటిని విడివిడిగా వస్త్రఘాలితం చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి. ఉదయం , సాయంత్రం పరగడుపున తీసుకోవాలి. చిన్న పిల్లలకు చిటికెడు , పెద్ద పిల్లలకు పాటు టీ స్పూను , పెద్దవాళ్ళకు సగం టీ స్పూను తేనెతో కలిపి ఇవ్వాలి. జ్ఞాన ముద్ర లేదా సరస్వతి ముద్రను వేయాలి. 10 రోజుల లోపే ఎంతో మార్పు కనబడుతుంది.
-డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు
చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
Comments
Please login to add a commentAdd a comment