భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత | Samantha Reveals Benefits Of Hot Stone Bath - Sakshi
Sakshi News home page

Samantha: భూటాన్‌లో 'హాట్‌ స్టోన్‌ బాత్‌' ట్రీట్‌మెంట్‌ తీసుకున్న సమంత

Published Wed, Nov 8 2023 4:26 PM | Last Updated on Wed, Nov 8 2023 5:22 PM

Samantha Reveals Benefits Of Hot Stone Bath - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టిపె​ట్టింది. తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తోంది సమంత. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం భూటాన్‌లో ఉన్న సమంత.. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఆ ట్రీట్‌మెంట్‌ వల్ల కలిగే ఉపయోగాలను సైతం పంచుకుంది. 

భూటాన్‌లో హాట్‌ స్టోన్‌ బాత్‌ అనే ఆయుర్వేద ట్రీట్‌మెంట్‌ బాగా ఫేమస్‌. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్‌ చేస్తూ..''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్‌లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్‌ ప్రజలు స్టోన్‌ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్‌ హాట్‌ టబ్‌లోకి చేరుతాయి.

ఈ ప్రక్రియలో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించింది సమంత.

మజిల్‌ పెయిన్‌, ట్రావెల్‌ సిక్‌నెస్‌, మజిల్‌ - బోన్‌ రిలేటెడ్‌ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్‌, స్పాండిలైటిస్‌, జాయింట్‌ పెయిన్స్, స్టొమక్‌ సిక్‌నెస్‌ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్‌ ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ వంటి ప్రదేశాలకు వెళ్లింది. ఇప్పుడు భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement