హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం.
కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది.
చదవండి: డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా?
Comments
Please login to add a commentAdd a comment