Actress Kalpika Ganesh Comments On Trolling And Samantha Myositis Disease - Sakshi
Sakshi News home page

kalpika Ganesh : 'సమంత లాగే నేను కూడా.. 13 ఏళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా'..

Published Sun, Nov 20 2022 2:43 PM | Last Updated on Sun, Nov 20 2022 3:15 PM

Actress Kalpika Ganesh Comments On Trolling And Samantha Myositis Disease - Sakshi

నటి కల్పికా గణేష్‌ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, పడిపడి లేచే మనసు వంటి చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన కల్పికా రీసెంట్‌గా యశోద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అ‍యితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా తెరపైకి వస్తున్న కల్పిక తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్పిక కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది.

ఓ కాలేజీ ఫంక్షన్‌లో గెస్టుగా పిలిచి అవమానించారని, దీని గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఓ వర్గం తనను టార్గెట్‌ చేసిందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయంలో తనపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారని తెలిపింది. 

ఇక సమంత లాగే తనకు కూడా మయోసైటిస్‌ ఉందని, గత 13 ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది. అయితే తాను ఫస్ట్‌ స్టేజ్‌లో ఉన్నట్లు చెప్పిన కల్పిక సమంత మాత్రం థర్డ్‌ స్టేజ్‌లో ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement