Actress Samantha Myositis Cure Vacation Mode, Shares Pics In Instagram Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Latest Photos Viral: హీరోయిన్ సమంత కథ వేరే.. అది మాత్రం!

Published Tue, Aug 8 2023 8:25 AM | Last Updated on Tue, Aug 8 2023 8:43 AM

Actress Samantha Myositis Cure Vacation Mode - Sakshi

ఎవరైనా అరుదైన వ్యాధికి గురైతే మానసిక వేదనకు గురవుతారు. తగిన వైద్యం కోసం ప్రయత్నిస్తారు. నటి సమంత మాత్రం ఇందుకు విరుద్ధమని చెప్పొచ్చు. ఎందుకంటే తను మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడిందనే విషయం తెలియగానే అందరిలా ఆవేదనను గురయ్యారు. కంట తడి కూడా పెట్టారు. కానీ కృంగిపోలేదు. ఎందుకంటే సమంత కథే వేరు కదా! ఈమెకు ధైర్యం కాస్త ఎక్కువే.

(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇంతకు ముందే జీవితంలో తగిలిన చాలా దెబ్బలు తట్టుకుంది. అందువల్ల మయోసైటిస్‌ వ్యాధికి ఓవైపు చికిత్స పొందుతూనే తాను కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసింది. ఇందులో 'సిటాడెల్‌' అనే వెబ్‌ సిరీస్‌ కూడా ఉంది. తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొత్తగా అంగీకరించిన చిత్రాలకు తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చికిత్స కోసం అమెరికాకి వెళ్తుందనుకున్న సమంత.. నేరుగా అక్కడికి వెళ్లలేదు. 

యూఎస్ వెళ్లడానికి ముందు ధ్యానం, యోగా, స్నేహితులతో డాన్స్‌లు అని సమంత.. తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆయా వీడియోలు, ఫొటోలని సోషల్ మీడియా పోస్ట్‌ చేస్తోంది. తాజాగా అందమైన స్మిమ్మింగ్‌ ఫూల్‌, పూలతోటలు, బంగ్లాలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇలా రాబోయేదంతా మంచి కాలం అని నమ్మకంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే దటీజ్‌ సమంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: పేరుకే స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement