Actress Samantha Undergoes Hyperbaric Therapy For Myositis, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: ఇంకా నయం కాని మయోసైటిస్‌.. ఆక్సిజన్‌ మాస్క్‌తో సమంత

Published Thu, Apr 27 2023 2:30 PM | Last Updated on Thu, Apr 27 2023 2:54 PM

Samantha undergoes hyperbaric therapy For Myositis - Sakshi

చిలిపి నవ్వుతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టే సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే! ఓవైపు చికిత్స తీసుకుంటూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ హుషారుగా కనిపిస్తుండటంతో వ్యాధి నెమ్మదిగా నయమవుతూ వస్తోందనుకున్నారంతా! కానీ ఇప్పటికీ అదే వ్యాధితో సతమతమవుతోంది సామ్‌. అందుకు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోయే ప్రత్యక్ష ఉదాహరణ!

తాజాగా సమంత హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో సామ్‌ ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని ఉంది. తాను హైపర్‌ బారిక్‌ థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ హైపర్‌ బారిక్‌ చికిత్స ద్వారా నిర్ణీత ప్రెజర్‌తో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందిస్తారు. దీని ద్వారా ఎక్కువ ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో చేరి ఇన్‌ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకునేందుకు ప్రేరేపిస్తుంది. అదనపు ఆక్సిజన్‌ బ్యాక్టీరియాపై పోరాటంలో సాయపడుతుంది. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇక ఆక్సిజన్‌ మాస్క్‌తో సామ్‌ను చూసిన అభిమానులు నువ్వు చాలా స్ట్రాంగ్‌, త్వరలోనే ఈ వ్యాధిని జయిస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా సామ్‌ చివరగా శాకుంతలం సినిమాలో నటించింది. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఆమె సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. 

చదవండి: నాలుగు రోజుల్లోనే 500కు పైగా సిగరెట్లు తాగా: అల్లరి నరేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement