స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే.ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించే సామ్ ఇలా అనారోగ్యం బారిన పడటం, కోలుకోవడానికి తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినీ తారలు సహా నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. ఈ క్రమంలో గ్లామర్ ఇండస్ట్రీ వెనుక అందాలు మాత్రమే కాదు.. అరుదైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్స్ బోలెడంత మంది ఉన్నారు. మరి ఆ హీరోయిన్స్ గురించి ఓసారి తెలుసుకుందాం.
ఇలియానా
దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఇల్లూ బేబీ టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా కూడా నిలిచింది.
అయితే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఇలియానా తనకు డిస్‌మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా పేర్కొంది. ఇదొక మానసిక వ్యాధి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు కానీ డాక్టర్ల సూచనతో దీన్నుంచి కొంత వరకు ఉపశమనం పొందొచ్చట.
అనుష్క శర్మ
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తాను యాంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చొంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకుంది.
సోనమ్ కపూర్
స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్న సోనమ్ డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతుందట. అయితే ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఆమె ఏమీ భయపడలేదు.
నయనతార
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదిచుకున్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఆమెకి స్కిన్ ఎలర్జీ ఉందట. మూవీ షూటింగ్స్‌లో భాగంగా తరుచూ మేకప్‌లు వేసుకోవాల్సి రావడంతో స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని జాగ్రత్తలు వాడుతూ మేకప్‌ని వేసుకోవడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఆమె నియమించుకుంది.
దీంతో పాటు ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుందట నయన్. ఎప్పుడైనా సరే కూల్ ఐటమ్స్ ఏం తిన్నా వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోవడం,, స్కిన్ పై రాషస్ రావడం వంటివి జరుగుతుంటాయట. ఇప్పటికీ దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుందట.
దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌తో పోరాడినట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. దీన్నుంచి బయటపడలేక చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు దీపికా బహిరంగంగానే చెప్పింది. ఎక్కువ డిప్రెషన్‌కు లోనైతే హార్ట్‌బీట్ ఒకసారిగా పెరిగి అస్వస్థతకు గురవుతుందట.ఇప్పటికీ రెగ్యులర్‌గా డాక్టర్స్‌తో టచ్‌లో ఉంటానని ఈ బ్యూటీ తెలిపింది.
పరిణితీ చోప్రా
ప్రియాంక చోప్రా సోదరిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. అయితే అక్క సపోర్ట్ లేకుండానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పరిణితీ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందట. ఈ సమస్యను అధిగమించేందుకు తరుచూ డాక్టర్స్‌ని కలుస్తానని స్వయంగా ఆమె వెల్లడించింది.
సమంత
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళంలో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండేది.
అయితే కొంతకాలంగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సామ్ తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment