స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత మయోసైటిస్ వ్యాధిపై ఆయన స్పందించారు. సినిమా షూటింగ్‌లో సమంతకు ఈ వ్యాధి ఉన్నట్లు తమకు తెలియదన్నారు.
చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందే మాకు తెలిసింది. అప్పటికే ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దామని అన్నాను. కానీ తమిళం ప్రేక్షకులందరికి తన వాయిస్ తెలుసు కాబట్టి తానే చెబుతానంది. ఇందుకోసం మూడు, నాలుగు రోజులు డాక్టర్ల సమక్షంలో ఉండి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఇక హిందీలో చిన్మయి చెప్పారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment