Shivalenka Krishna Prasad
-
‘యశోద’లో ఇకపై ఆ పదం కనబడదు: శివలెంక కృష్ణ ప్రసాద్
యశోద మూవీ వివాదంపై తాజాగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఈ సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్‌రావు యశోద మూవీ నిర్మాత, హీరోయిన్ సమంత, డైరెక్టర్స్ హరీశ్ నారాయణ్, హరి శంకర్‌లపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మా సినిమాలో ఈవా అనే పేరు నీ కాన్సెప్ట్ ప్రకారం పెట్టింది. వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదు. ఈవా హాస్పిటల్ వారిని నేను కలిసి జరిగినది చెప్పాను. ఇక భవిష్యత్లులో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు. మా నిర్ణయాన్ని ఈవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక జరిగిన పొరపాటు’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం హాస్పిటల్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. ‘యశోద లో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్ట్ అయ్యాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం’ అని ఆయన పేర్కొన్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ పెళ్లికూతురైన అదితి ప్రభుదేవ.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఘనంగా వివాహం -
సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్
‘‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్‌గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామంటూ మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. సమంత టైటిల్ రోల్లో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సమంతగారి వన్ విమన్ షో ‘యశోద’. ఈ చిత్రం సీక్వెల్ గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి. మా మూవీ ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది’’ అన్నారు. ‘‘మాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. హరి, హరీష్ మాట్లాడుతూ– ‘‘యశోద’ మా తొలి తెలుగు చిత్రం. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే సీక్వెల్ సమంతగారిపై ఆధారపడి ఉంది’’ అన్నారు. మాటల రచయితలు పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ– ‘‘మీరు రాయగలరు.. రాయండి. మీ సక్సెస్ చూడాలని ఉంది’’ అని మమ్మల్ని ప్రోత్సహించిన కృష్ణప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘యశోద’ని హిందీలో రిలీజ్ చేసిన యూఎఫ్ఓ లక్ష్మణ్, క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి, ఆర్టిస్టులు కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ, మధురిమ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజా సెంథిల్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత మయోసైటిస్ వ్యాధిపై ఆయన స్పందించారు. సినిమా షూటింగ్లో సమంతకు ఈ వ్యాధి ఉన్నట్లు తమకు తెలియదన్నారు. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందే మాకు తెలిసింది. అప్పటికే ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పిద్దామని అన్నాను. కానీ తమిళం ప్రేక్షకులందరికి తన వాయిస్ తెలుసు కాబట్టి తానే చెబుతానంది. ఇందుకోసం మూడు, నాలుగు రోజులు డాక్టర్ల సమక్షంలో ఉండి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్. ఇక హిందీలో చిన్మయి చెప్పారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సమంత మరో పాన్ ఇండియా చిత్రం టైటిల్ ఇదే, డైరెక్టర్లు ఎవరంటే..
Samantha New Pan India Movie Shooting Starts And Title Announced: విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో డజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో తన ఇంటర్నేషన్ ఫిలిం ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ కూడా ఉంది. ఈ సినిమాతోనే సామ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మానస్ బండారం బయట పెట్టిన అరియాన, కన్నీళ్లు పెట్టుకున్న పింకీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కబోతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం(డిసెంబర్ 6) పూజ కార్యక్రమాలను జరుపుకున్న ఈ మూవీ టైటిల్‌ను యశోదగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలపెట్టనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త డైరెక్షర్లు హరి, హరీశ్‌లు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని మిగతా తారాగణాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. చదవండి: దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి ఈ మేరకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చెప్పారు. With your blessings 🙏 @SrideviMovieOff @krishnasivalenk @hareeshnarayan @dirharishankar #Yashoda#YashodaTheMovie pic.twitter.com/OjogcgDvQm — Samantha (@Samanthaprabhu2) December 6, 2021 -
ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్ ట్రావెల్ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం. విమానం స్మూత్‌గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్ టైమ్‌లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్‌గారు అన్నారు. అయితే టైం మెషిన్‌ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్‌జీ వెల్స్ అనే రైటర్ రాసిన ది టైమ్ మెషిన్ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి. ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్‌గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి, ‘సార్.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్ స్టేషన్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు అంకుల్ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్‌లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. దాంతో కెమెరామేన్ వీఎస్సార్ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు. -
ఈ నెల నాకు ట్రిపుల్ ధమాకా
‘‘ఎఫ్ 2’ సినిమాలో నేను చేసిన హనీ పాత్ర, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజమ్ చాలా పాపులర్ అయ్యాయి. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాను’’ అన్నారు మెహరీన్. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త్త నిర్మించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ కథ చెప్పగానే అద్భుతం అనిపించింది. అన్ని ఎమోషన్స్‌ను చూపించా ల్సిన పాత్ర. ఇలాంటి రోల్ ఇదివరకెప్పుడూ చేయలేదు. నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటా. నేను షార్ట్ ఫిలింస్ నిర్మి స్తుంటా. నా షార్ట్ ఫిల్మ్‌లో కల్యాణ్ రామ్‌గారు హీరోగా చేస్తారు. ► కేవలం కుటుంబ భావోద్వేగాలు మాత్రమే కాదు ప్రేమ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. పండగకి వస్తున్న పండలాంటి సినిమా. కథ విని, ఈ పాత్ర నేను చేయగలనా? అని దర్శకుడిని అడిగాను. ‘చేయగలవనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ► ఇది గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు దర్శకుడు. మాతృక చూస్తే ఆ పాత్ర తాలూకు ప్రభావం నా మీద పడుతుందని చూడలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కష్టపడి నేర్చుకుని సింగిల్ టేక్‌లో పూర్తి చేశాను. ఈ సినిమా టైటిల్ కల్యాణ్‌రామ్‌గారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. నిజాయితీగా ఉంటారు. ► సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరిస్తాం. మంచి సినిమా అందించాలనుకుంటాం. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్. ► సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నాకు అమ్మతో సమానం. ప్రస్తుతానికి బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. నా తమ్ముడు (గురు ఫతేహ్ ) బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నాడు. ► ఈ జనవరి నాకు ట్రిపుల్ ధమాకా. ‘ఎంత మంచివాడవురా!’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమిళంలో ధనుష్‌తో చేసిన ‘పటాస్’ 16న విడుదలవుతుంది. జనవరి 31న ‘అశ్వథ్థామ’ విడుదలవుతుంది. ► ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేయడం నా బలం. పాత్రకు పూర్తిగా కనెక్ట్ అయి నటించడానికి ప్రయత్నిస్తాను. అందుకే గ్లిజరిన్ కూడా అవసరం లేకుండా ఎమోషనల్ సన్నివేశాలు చేస్తాను. -
కొత్త తరం ప్రేమకథ
‘జెంటిల్మెన్’ వంటి హిట్ మూవీతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ల కాంబినేషన్ మొదలైంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై మళ్లీ ఇంద్రగంటితో శివలెంక ఓ సినిమా మొదలుపెట్టారు. సుధీర్‌బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో జరిగాయి. మణిరత్నం ‘చెలియా’ సినిమాలో నాయికగా నటించిన బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో కథానాయిక. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. సుధీర్‌బాబుకి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి షూటింగ్ మొదలుపెడతాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు ఇంద్రగంటి. నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్. -
సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!
‘‘ ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమాతో మా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ను స్థాపించాను. ఇప్పటికి 28 ఏళ్లు అయింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చేసినా ‘ఆదిత్య-369’ సినిమా నిర్మాతగా ఇప్పటికీ గుర్తుపట్టడం నా అదృష్టం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావా లనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ నా బేనర్లో సినిమా తీయలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌ను మంచి సినిమాతో ప్రారంభించాననే అనుకుంటున్నా’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏడేళ్ల విరామం తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ ‘జెంటిల్మన్’ కథను తమిళ రచయిత డేవిడ్ నాథన్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. బాగా నచ్చింది. ఎప్పటినుంచో నా మైండ్‌లో ఈ కథ నలుగుతూనే ఉంది. మోహనకృష్ణ ‘బందిపోటు’ సినిమా అంగీకరించక ముందే నేనాయనతో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆ సినిమా మొదలైంది. సర్లే.. తర్వాత చేద్దా మనుకున్నా. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రిస్క్ అవుతుందని మోహన్ అన్నారు. కానీ ఫ్లాప్‌లు ఎవరికైనా సహజం. అందుకే పర్లేదని చెప్పగానే కొన్ని కథలు వినిపించారు. అప్పుడు చాన్నాళ్ల క్రితం విన్న కథ గురించి ఆయనకు చెప్పా. నిజానికి మోహనకృష్ణకు సొంతగా కథలు రాసుకోవడం ఇష్టం. అందుకే అయిష్టంగానే వినడానికి అంగీకరించారు. కానీ కథ నచ్చి, సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. నాని చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కథకు కీలకం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలోని ప్రతి సీన్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో సాంకేతికత పెరిగింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంచి సినిమాలు తీయాలన్నది నా ఆలోచన’’ అని చెప్పారు.