యశోద మూవీ వివాదంపై తాజాగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఈ సినిమాతో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్‌రావు యశోద మూవీ నిర్మాత, హీరోయిన్ సమంత, డైరెక్టర్స్ హరీశ్ నారాయణ్, హరి శంకర్లపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మా సినిమాలో ఈవా అనే పేరు నీ కాన్సెప్ట్ ప్రకారం పెట్టింది. వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదు. ఈవా హాస్పిటల్ వారిని నేను కలిసి జరిగినది చెప్పాను. ఇక భవిష్యత్లులో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు.
మా నిర్ణయాన్ని ఈవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక జరిగిన పొరపాటు’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం హాస్పిటల్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. ‘యశోద లో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్ట్ అయ్యాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్‌ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం’ అని ఆయన పేర్కొన్నారు.
చదవండి:
‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
పెళ్లికూతురైన అదితి ప్రభుదేవ.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఘనంగా వివాహం
Comments
Please login to add a commentAdd a comment