Hero Venkatesh Daughter And Sushant Respond On Samantha Myositis Post - Sakshi
Sakshi News home page

Samantha: సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై స్పందించిన మరో అక్కినేని హీరో, ‘వెంకటేశ్‌ కూతురు

Published Tue, Nov 1 2022 9:23 AM | Last Updated on Tue, Nov 1 2022 10:37 AM

Hero Venkatesh Daughter and Sushant Respond on Samantha Myositis Post - Sakshi

సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్‌యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్‌ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్‌, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని హీరో అఖిల్‌, నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. 

చదవండి: సిద్దార్థ్‌, అదితిల సీక్రెట్‌ డేటింగ్‌? వైరల్‌గా హీరో పోస్ట్‌

అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్‌ కూతురు అశ్రిత సైతం సామ్‌ పోస్ట్‌పై స్పందించింది. సమంత పోస్ట్‌కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్‌ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్‌ హాట్‌ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్‌ కూడా సామ్‌ పోస్ట్‌పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్‌’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్‌ చూసి సామ్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్‌ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

చదవండి: 
సమంతకు సోకిన మయోసైటిస్‌ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Rambha Car Accident: హీరోయిన్‌ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement