సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. గతేడాది యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత కోలుకుంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మళ్లీ దగ్గరవుతోంది. ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు. సమంత ప్రస్తుతం శాకుంతలం, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొత్త ఏడాది జవనరిలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సామ్.
కొత్త ఏడాది జనవరిలో తన లైఫ్ ఎలా సాగిందో సోషల్ మీడియాలో ఫొటోల ద్వారా పంచుకుంది. సిటాడెల్ చిత్రబృందంతో మీటింగ్, వర్కౌట్లు, ఫొటోషూట్‌లతో జనవరి నెల గడిచిపోయిందంటూ సామ్ పోస్ట్ చేసింది. సమంత తన పోస్ట్‌లో.. 'గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ సర్దుకుంటాయని నేను నీకు మాటిస్తున్నా. గత 7-8 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు సాగావు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ధైర్యంగా అడుగేశావ్. ఈ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో.' అంటూ జనవరిలో జరిగిన విషయాలను ఓసారి గుర్తు చేసుకున్నారు సామ్. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment