జీఎస్టీను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తెలిపారు.
ఇండోర్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను వ్యక్తులు, సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఏ బ్యాంకు నుంచి అయినా సరే పన్ను చెల్లించవచ్చని ఆదివారమిక్కడ జరిగిన గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్‌లో వెల్లడించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది.