మే నెల జీఎస్‌టీ వసూళ్లు ఇవీ.. | GST Collection For May Surges Past Rs. 94,016 Crore | Sakshi
Sakshi News home page

మే నెల జీఎస్‌టీ వసూళ్లు ఇవీ..

Published Fri, Jun 1 2018 4:50 PM | Last Updated on Fri, Jun 1 2018 4:50 PM

GST Collection For May Surges Past Rs. 94,016 Crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్‌టీ) వసూళ్లు   ఈ నెలలో  స్వల్పంగా తగ్గాయి. మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా నమోదయ్యాయి. గత నెల ఏప్రిల్‌లో  జీఎస్‌టీవసూళ్లు గరిష్ఠంగా రూ. 1.03లక్షల కోట్లుగా ఉన్నాయి.  2017-2018 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్‌టీ వసూళ్లు రూ. 89,885కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ ఆధియా ఈ లెక్కలను  ట్విటర్‌లో శుక్రవారం వెల్లడించారు.  ఇ-వే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మెరుగైన ప్రదర్శనను ఇది ప్రతిబింబిస్తుందని ఆదియా పేర్కొన్నారు.  మొత్తం వసూళ్లు పెరగడమేకాకుండా.. రిటర్న్స్‌ సంఖ్య కూడా పెరిగిందన్నారు. మే 31 వరకు ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన రిటర్న్స్‌ సంఖ్య 60.47 లక్షలతో పోలిస్తే 62.46కి పెరిగిందన్నారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు ప్రకారం సర్దుబాటు అనంతరం  రూ. 15,866 కోట్లు సెంట్రల్ జిఎస్టీ (సిజిఎస్‌టీ), రాష్ట్ర జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ.21,691 కోట్లు. రూ. 49,120 కోట్లు ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టీ (ఐజీఎస్‌టీ),  సెస్‌ వసూళ్లుగా రూ. 7,339 కోట్లు.  మే 31 వరకు ఏప్రిల్‌ నెల రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 62.47లక్షలు. మార్చి నెల జీఎస్‌టీ పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ. 6696కోట్లు విడుదల చేశారు. దీంతో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నాటి(జులై, 2017) నుంచి మార్చి, 2018 వరకు రాష్ట్రాలకు అందించిన జీఎస్‌టీ పరిహారం రూ. 47,844కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement