ముంబై: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. దీనితో రూ. 7,000 కోట్ల రుణ కుంభకోణంతో కూరుకుపోయిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్... రానున్న కాలంలో యూనిటీ బ్యాంక్‌లో విలీనం కావడానికి మార్గం సుగమం అయ్యింది. సెంట్రమ్ గ్రూప్, పేమెంట్స్ యాప్ భారత్‌పే 51:49 భాగస్వామ్యంతో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటయ్యింది. అక్టోబర్ 12న సంస్థ ఆర్‌బీఐ లైసెన్స్ పొంది రికార్డు సమయంలో కార్యకలాపాలు ప్రారంభించింది. పీఎంసీ బ్యాంక్‌ను యూనిటీ బ్యాంక్ స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఆర్‌బీఐ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఒక బ్యాంక్ మరొక బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవలంటే, ఆ బ్యాంక్ మొదట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment