బ్రిటన్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయని ఆ దేశ హై కమిషనర్ డొమ్నిక్ అస్కిత్ అన్నారు. యూకేలోని విశ్వవిద్యాలాయాలు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నాయని ఆయన అన్నారు. మహిళా ఆర్థిక సాధికారికతపై యూఎన్ నివేదికను ఆవిష్కరిస్తున్న సభలో పలు అంశాలపై అస్కిత్ మాట్లాడారు. భారతీయ విద్యార్థుల కోసం ఎలాంటి పరిమితులు లేకుండానే బ్రిటన్‌లో చదువుకునేందుకు వీసాలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.