బ్యాంక్ ఖాతాలో పరిమితికి మించి డిపాజిట్ చేసి..ఆదాయ పన్ను(ఐటీ) పరిధిలోకి వచ్చారో..? ఆహార భద్రత (రేషన్) కార్డు, గ్యాస్ సబ్సిడీపై వేటుపడటం ఖాయం. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆహార భద్రత లబ్ధిదారులు, గ్యాస్ వినియోగదారులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ఆధార్ అనుసంధానం ఆధారంగా బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ వివరాలు ఆరా తీసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించిన ఆదాయ పన్నుశాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది