శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రతీరోజూ ట్వీట్లను చూడడానికి పరిమితి విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్ అకౌంట్లకు వేర్వేరు పరిమితులు విధించారు. అన్‌వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకి 600 పోస్టులు మాత్రమే చూడగలరని, వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకి 6 వేల పోస్టులు చూడగలరని శనివారం ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.
త్వరలో ఈ ట్వీట్ల సంఖ్యను అన్‌వెరిఫైడ్ అకౌంట్లకు 800కి వెరిఫైడ్ అకౌంట్లకి 8 వేలకు పెంచుతామని చెప్పారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారులకి శనివారం ట్విట్టర్ యాక్సెస్‌లోకి రాలేదు. కొందరు ట్వీట్లు చేస్తుంటే కెనాట్ రిట్రైవ్ ట్వీట్స్, లిమిట్ ఎక్సీడెడ్ అన్న మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ట్విట్టర్ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విట్టర్ డేటాను చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధతో పని చేసే వ్యవస్థలకి శిక్షణ ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ పరిమితులు వచ్చాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment