మోదీ కోసం పెద్దపులి కూడా బుద్ధిగా..!
మోదీ కోసం పెద్దపులి కూడా బుద్ధిగా..!
Published Tue, Nov 1 2016 2:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనలోని సరికొత్త కళను తాజాగా బయటపెట్టారు. మోదీలో ఓ మంచి ఫొటోగ్రాఫర్ ఉన్నారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లిన మోదీ తనలోని ఫొటోగ్రాఫర్‌ను వెలికితీశారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో కలిసి నయా రాయ్‌పూర్‌లో ఉన్న నందన్‌వన్ జంగల్ సఫారీని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా కెమెరా పట్టుకొని బోనులో ఉన్న పులిని ఫొటోను తీసేందుకు మోదీ తపించారు. మోదీని ఆ పులి తదేకంగా చూస్తుండగా.. మంచి క్లిక్ కోసం పలు పోజుల్లో ఆయన ప్రయత్నించారు. మోదీ ఇలా ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. బోనులోని పులి కూడా గాండ్రించడం గట్రా చేయకుండా బుద్ధిగా పోజులు ఇచ్చింది. ఇలా మోదీ తనలోని ఫొటోగ్రఫీ కళను చాటుతున్న వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నయా రాయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్) చాలా సామరస్యంగా ఏర్పడ్డాయని, ఇందుకుగాను ఆయన తరాలపాటు గుర్తుండిపోతారని అన్నారు. ఛత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో ఎంతో దూసుకెళ్లుతున్నదని, ఇది రానున్న తరాలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందని ఆయన అన్నారు.
Advertisement