Naya Raipur
-
వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా
నయా రాయపూర్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని గాంధీ కుటుంబానికి ఏటీఎంలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసిందని ఏకరువు పెట్టారు. అదొక్కటే మార్గం.. అమిత్ షా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. బొగ్గు, మద్యం, ఆన్లైన్ బెట్టింగులతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అన్నారు. డిసైడ్ చేసుకుని వార్ వన్‌సైడ్ చేయండి.. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణాల ప్రస్తావన తీసుసుకొస్తూ ఛత్తీస్‌గఢ్ యువతను ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేక వారిని బంగారు భవిష్యత్తు వైపుకు నడిపించే బీజేపీ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని.. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో.. అభివృద్ధికి బాటలు వేసే బీజేపీ ప్రభుత్వం కావాలో ఆలోచించుకొమ్మని.. గిరిజన సంస్కృతిని కాపాడే బీజేపీ కావాలో, మతమార్పుడులతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కాంగ్రెస్ కావాలో ఛత్తీస్‌గఢ్ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. వారిని వదిలిపెట్టం.. ఛత్తీస్‌గఢ్‌లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అన్నారు. ఇది కూడా చదవండి: 'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!! -
ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని ‘అటల్ నగర్’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే కొత్త రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రమణసింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రాయ్‌పూర్‌లోని సెంట్రల్ పార్కుకు, బిలాస్పూర్ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీకి, మార్వా థర్మల్ ప్లాంట్‌కు, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరు పెట్టనున్నట్లు చెప్పారు. దీంతోపాటు తాను రెండో దశ నిర్వహించే ‘వికాస్ యాత్ర’కు కూడా ‘అటల్ వికాస్ యాత్ర’గా పేరు మార్చామన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం వాజ్‌పేయి పేరుపై కవులకు జాతీయ స్థాయి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇవ్వనున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ‘అటల్ బిహరీ వాజ్‌పేయి సుహాసన్ అవార్డు’ను అందిస్తామన్నారు. అటల్ జీవిత విశేషాలు భావితరాలు తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా రాష్ట్రంలోని ఓ బెటాలియన్‌కు ‘పోఖ్రాన్ బెటాలియన్’గా పేరు పెట్టనున్నామని రమణసింగ్ వివరించారు. పలు నదుల్లో వాజ్‌పేయి అస్థికలు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికల్లోని కొంత భాగాన్ని ఆయన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని 10 నదుల్లో కలపనున్నారు. ఈ మేరకు ‘కలశ యాత్ర’పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ మంగళవారం నిర్ణయించింది. ఇందులో తొమ్మిది చోట్లకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అస్థికలు ఉన్న వాహనాలు బయలుదేరతాయని, మరోచోటికి వెళ్లే వాహనం వాజ్‌పేయి సొంత ఊరు అయిన గ్వాలియర్ నుంచి బయలుదేరుతుందని రాష్ట్ర పార్టీ మీడియా ఇన్చార్జి లోకేంద్ర పరాశర తెలిపారు. అలాగే కర్ణాటకలోని 8 నదుల్లో వాజ్‌పేయి అస్థికలను కలపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి అస్థికలను తీసుకురానున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని 11 నదుల్లో అస్థికల నిమజ్జనం చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ చీఫ్ రావుసాహెబ్ దాన్వే చెప్పారు. కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్, ప్రకాశ్ జవడేకర్ బుధవారం(నేడు) ఢిల్లీ నుంచి అస్థికలను తీసుకొస్తారన్నారు. 11 ప్రభుత్వ, 2 ప్రైవేట్ వర్సిటీల్లో అధ్యయన కేంద్రాల ఏర్పాటు కోసం రూ.20 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. తమిళనాడులోని రామేశ్వరం, కన్యాకుమారిలో సముద్రంలో 26న నిమజ్జనం చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సౌందర్యరాజన్ తెలిపారు. అలాగే కావేరి, వైగై, భవాని నదుల్లోనూ వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తామని తెలిపారు. గోవాలో 24న వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తామని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. మండోవి, జ్వారీ నదుల్లోనూ నిమజ్జనం చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. -
మోదీ కోసం పెద్దపులి కూడా బుద్ధిగా..!
-
మోదీ కోసం పెద్దపులి కూడా బుద్ధిగా..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనలోని సరికొత్త కళను తాజాగా బయటపెట్టారు. మోదీలో ఓ మంచి ఫొటోగ్రాఫర్ ఉన్నారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు వెళ్లిన మోదీ తనలోని ఫొటోగ్రాఫర్‌ను వెలికితీశారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో కలిసి నయా రాయ్‌పూర్‌లో ఉన్న నందన్వన్ జంగల్ సఫారీని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా కెమెరా పట్టుకొని బోనులో ఉన్న పులిని ఫొటోను తీసేందుకు మోదీ తపించారు. మోదీని ఆ పులి తదేకంగా చూస్తుండగా.. మంచి క్లిక్ కోసం పలు పోజుల్లో ఆయన ప్రయత్నించారు. మోదీ ఇలా ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. బోనులోని పులి కూడా గాండ్రించడం గట్రా చేయకుండా బుద్ధిగా పోజులు ఇచ్చింది. ఇలా మోదీ తనలోని ఫొటోగ్రఫీ కళను చాటుతున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నయా రాయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్) చాలా సామరస్యంగా ఏర్పడ్డాయని, ఇందుకుగాను ఆయన తరాలపాటు గుర్తుండిపోతారని అన్నారు. ఛత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రమైనా అభివృద్ధిలో ఎంతో దూసుకెళ్లుతున్నదని, ఇది రానున్న తరాలకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందని ఆయన అన్నారు.