నయా రాయపూర్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడుతోందని గాంధీ కుటుంబానికి ఏటీఎంలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసిందని ఏకరువు పెట్టారు.
అదొక్కటే మార్గం..
అమిత్ షా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. బొగ్గు, మద్యం, ఆన్‌లైన్ బెట్టింగులతో రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కుంభకోణాలు, దౌర్జన్యాలు, పెట్రేగిపోతున్నాయని ఇక్కడ పరిస్థితి బాగుపడాలంటే అది ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని అన్నారు.
డిసైడ్ చేసుకుని వార్ వన్‌సైడ్ చేయండి..
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణాల ప్రస్తావన తీసుసుకొస్తూ ఛత్తీస్‌గఢ్ యువతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేక వారిని బంగారు భవిష్యత్తు వైపుకు నడిపించే బీజేపీ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని.. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో.. అభివృద్ధికి బాటలు వేసే బీజేపీ ప్రభుత్వం కావాలో ఆలోచించుకొమ్మని.. గిరిజన సంస్కృతిని కాపాడే బీజేపీ కావాలో, మతమార్పుడులతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే కాంగ్రెస్ కావాలో ఛత్తీస్‌గఢ్ ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.
వారిని వదిలిపెట్టం..
ఛత్తీస్‌గఢ్‌లో బాఘేల్ ప్రభుత్వం మొత్తం అవినీతి రికార్డులన్నిటినీ బద్దలుకొట్టేసిందని బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడ్డ పార్టీ ఒక్కరినీ తలకిందులుగా వేలాడదీసి గాడిలో పెడతామని అన్నారు. కేంద్రంలోనూ ఇక్కడా బీజేపీ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే కేవలం రెండేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని అన్నారు.
ఇది కూడా చదవండి: 'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!
Comments
Please login to add a commentAdd a comment