దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్ పట్టణంలోని సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు యవతులను అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక పరపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాపర్‌పట్టిలోని ఓ ఇంట్లో నలుగురు యువతులు వ్యభిచారం నిర్వహిస్తుండగా.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న పోలీసులు ఇందులో విటుల పేర్లను మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. అదుపులోకి తీసుకున్న యువతుల స్వస్థలాలు రాయ్‌పూర్, కోల్‌కత, గువాహటిగా పోలీసులు తెలిపారు.