మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై.. | Sandeep Kanwar Drunken Ruckus And Lying On Road | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఎమ్మెల్యే కొడుకు హంగామా.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Published Sat, Nov 5 2022 9:26 PM | Last Updated on Sat, Nov 5 2022 9:28 PM

Sandeep Kanwar Drunken Ruckus And Lying On Road - Sakshi

Sandeep Kanwar.. మాజీ హోం మంత్రి కుమారుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకాలదాకా మద్యం సేవించి ఒళ్లు మరిచిపోయి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ మాజీ హోం మంత్రి, రాంపూర్‌ ఎమ్మెల్యే నానకీరామ్‌ కన్వర్‌ కుమారుడు సందీప్‌ కన్వర్‌ ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుపై రచ్చచేశాడు. బస్సును ఆపి.. బస్సు కండక్టర్‌పై దాడికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డు మీద బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో, ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సందీప్‌ కన్వర్‌ అక్కడి నుంచి ఆయన ఇంటికి  తరలించారు. దీనికి సంబంధించిన వీడియో​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, సందీప్‌ కన్వర్‌ ప్రస్తుతం కోర్బా ఏరియా నంబర్ 1 జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. సందీప్‌ తండ్రి నానకీరామ్‌ కన్వర్‌.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో(2008-13) ఉన్న కాలంలో నానకీరామ్‌ హోం మంత్రిగా బాధ్యతలు కొనసాగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement