భార‌తీయ రైల్వే స‌రికొత్త రికార్డు! | Indian Railways Longest Freight Train Vasuki Sets a New Record | Sakshi
Sakshi News home page

భార‌తీయ రైల్వే స‌రికొత్త రికార్డు!

Published Sun, Jan 24 2021 5:35 PM | Last Updated on Sun, Jan 24 2021 5:47 PM

Indian Railways Longest Freight Train Vasuki Sets a New Record - Sakshi

ఛత్తీస్‌గడ్: ప్ర‌పంచంలో అతిపెద్ద రైల్వే వ్య‌వ‌స్థ‌ల్లో భార‌తీయ రైల్వే వ్య‌వ‌స్థ ఒక‌టి. తాజాగా భార‌తీయ రైల్వే స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగ‌న్ల‌తో ఐదు రైళ్ల‌ను అనుసంధానించి న‌డిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రైలుకు 'వాసుకి' అని భార‌తీయ రైల్వే పేరు పేట్టింది. ఈ సరుకు రవాణా వాసుకి రైలును ఛత్తీస్‌గడ్‌లోని భిలై నుంచి కోర్బా వరకు నడుపుతూ భార‌తీయ రైల్వే ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య సుమారు 224 కిలో మీట‌ర్ల దూరం ఉంటుంది. ఐదు రైళ్ల‌ను అనుసంధానించిన త‌రువాత ఈ రైలు పొడ‌వు 3.5 కి.మీ.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి సాధార‌ణ రైళ్లు)

భారతీయ రైల్వే ఈ ఘనత సాధించినందుకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్లో ప్రశంసించారు. పారిశ్రామిక ఉత్పత్తులను అధికంగా మొత్తంలో పంపిణీ చేయడంతో పాటు సరుకు రవాణా రంగంలో కీలక మార్పులను ఈ రైలు తీసుకొచ్చింది అని పేర్కొన్నారు. దీనిని ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సహాయంతో నడిపారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ గూడ్స్ ర‌వాణా చేసేందుకే ఈ వాసుకి'ని చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. గ‌తంలో 177 వేగ‌న్ల‌తో మూడు గూడ్స్ రైళ్ల‌ను అనుసంధానించి న‌డిపారు. దీనికి 'సూప‌ర్ అన‌కొండ' అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement