vasuki
-
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్‌గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పవన్-వాసుకిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకి.. వన్ ఫిల్మ్ వండర్లా ఒక్క సినిమాకే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్స్క్రీన్పై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అయిన ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో మిడిల్ క్లాస్ అమ్మగా అదరగొట్టేసింది. వాసుకి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ‘రమణి వర్సెస్ రమణి’, ‘మర్మదేశం’ అనే సీరియల్స్‌తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ కావడంతో తర్వాత సినీ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. ‘తొలిప్రేమ’లో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభినాలను చూరగొంది. ఆ సమయంలోనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోన్న ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్‌తో మిడిల్ క్లాస్ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్ కిడ్స్‌కి బాగా రిలేట్ అవుతున్నాయి. ఇరవై మూడేళ్ళు సినిమాల్లో నటించనప్పటికీ ఆనంద్ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉండేది. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదెప్పుడూ! – వాసుకి ఆనంద్ సాయి. View this post on Instagram A post shared by Sai Madhav Battula (@saimadhavbattula) -
పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!
పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కూడా సరిగా తిండి లేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేషన్ ఆమె సాయం చేశారు. అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డును సైతం అందజేశారు. ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే పాకీజాకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాను ఇంకా అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తిరుపతిలోని దుకాణాల యజమానులు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ కనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా అందరి నవ్వించిన వాసుకిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఓకేలా ఉండవని ఆమె పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) -
‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆర్టిస్టులు నటిస్తారు. కానీ మనుషులుగా మనందరం నిత్యం విభిన్నమైన సందర్భాలు, పరిస్థితుల్లో నటిస్తుంటాం. సో.. మనందరం నటులమే. ఇరవయ్యేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చినా నేను భయపడలేదు. సెట్స్‌లో ఎక్కువగా టేక్స్ తీసుకోకుండానే యాక్ట్ చేశాను. అయినా నా భర్త ఆనంద సాయి (ఆర్ట్ డైరెక్టర్)తో నిత్యం సినిమాలు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉన్నాను’’ అన్నారు వాసుకి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాసుకి మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘తొలిప్రేమ’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను. ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలే ప్రాధాన్యంగా అనిపించాయి. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ప్రస్తుతం ఫారిన్లో మా అమ్మాయి మెడిసిన్ ఫోర్త్ ఇయర్, అబ్బాయి ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దాంతో నాకు ఖాళీ దొరికింది. నేను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. ఇటు నటిగా నాకు నచ్చే, నప్పే పాత్రలు చేస్తాను. ‘అన్నీ మంచి శకునములే’లో సంతోష్ శోభన్‌కు అక్కగా నటించాను. తమ్ముడ్ని సపోర్ట్ చేసే అక్క పాత్ర ఇది. కథ బాగుంటే తల్లిగా చేయడానికి కూడా రెడీ’’ అన్నారు. -
నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా
సినీ నటుల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వారి జీవితంలో ఒడుదొడుకులు రావడం సహజం. ఇక కొందరి జీవితాలు మరీ దుర్భరమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడిన వారిలో సీనియర్ నటి పాకీజా ఒకరు. ఆమె దీన స్థితిని చూసిన టాలీవుడ్ హీరోలు ఆమెకు సాయం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలిచారు. (ఇది చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్) కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటున్న ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై ఆమెకు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. తెలుగులో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీతో ఆమె ఫేమస్ అయిపోయారు. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే ఆమె హైదరాబాద్‌లోనే అద్దెగదిలో ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెన్నైలో తాను చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చాక ఆ పరిస్థితులు మారిపోయాయని తెలిపారు. ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్‌లోనే ఉంటానని.. చెన్నై వెళ్లనని సంతోషంగా చెబుతోంది పాకీజా వాసుకి. -
అప్పుడు అందరినీ నవ్వించి.. ఇప్పుడు తిండి కోసం తిప్పలు
తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ మీకు గుర్తుందా? అంతే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం కామెడీ మామూలుగా పాపులర్ కాలేదు. ఈ చిత్రంలో అందరినీ కడుప్పబ్బా నవ్వించిన పాత్ర మరొకటుంది. బ్రహ్మనందంతో కామెడీ సీన్స్‌లో కనిపించిన పాకీజా రోల్. ఆ చిత్రం ద్వారానే ఆమె తెలుగులో పాపులర్ అయింది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు, స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో నటించింది. కానీ.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోంది. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి రిక్త హస్తాలతో మిగిలిపోయి దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాల్లోనూ నటించింది పాకీజా. అందరి స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులోనే దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందరినీ నవ్వించినా ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల ఆమె ఛానెల్‌తో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆమె పరిస్థితికి గల కారణాలను వివరించారు. పాకీజా రోల్లో మంచి కమెడియన్ అందరినీ నవ్వించినా పేరు తెచ్చుకున్నా.. ఆస్తులు ఏ మాత్రం లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అందరి సినిమాల్లో చేశా. తెలుగులో దాదాపు 50 సినిమాలు చేశా. ఆ తర్వాత నా స్వస్థలం తమిళనాడులోని కరైకుడికి వెళ్లా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ జయలలిత. 150 చిత్రాల్లో నటించినా చెన్నైలో సొంత ఇల్లు లేదు. సాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు హీరోలను సంప్రదించాను. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నా పరిస్థితిని వివరించా. ఎవరూ సాయం చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ ఉంటున్నా. ఎవరైనా ఆదుకుంటారేమో అని వేచి చూస్తున్నా.' అని ఎమోషనలయ్యారామె. -
భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!
ఛత్తీస్గడ్: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రైలుకు 'వాసుకి' అని భారతీయ రైల్వే పేరు పేట్టింది. ఈ సరుకు రవాణా వాసుకి రైలును ఛత్తీస్‌గడ్‌లోని భిలై నుంచి కోర్బా వరకు నడుపుతూ భారతీయ రైల్వే ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య సుమారు 224 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఐదు రైళ్లను అనుసంధానించిన తరువాత ఈ రైలు పొడవు 3.5 కి.మీ.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు) Longest hauling! Recently, @secrail hauled 3.5 Km freight train, Vasuki, towing 295 wagons, from #Bhilai to #Korba#PhotoOfTheDay #freight #railways #India #IndianRailways #Chhattisgarh pic.twitter.com/WMKYdWy8G1 — South Western Railway (@SWRRLY) January 23, 2021 భారతీయ రైల్వే ఈ ఘనత సాధించినందుకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్లో ప్రశంసించారు. పారిశ్రామిక ఉత్పత్తులను అధికంగా మొత్తంలో పంపిణీ చేయడంతో పాటు సరుకు రవాణా రంగంలో కీలక మార్పులను ఈ రైలు తీసుకొచ్చింది అని పేర్కొన్నారు. దీనిని ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సహాయంతో నడిపారు. తక్కువ సమయంలో ఎక్కువ గూడ్స్ రవాణా చేసేందుకే ఈ వాసుకి'ని చేపట్టినట్లు చెప్పారు. గతంలో 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి నడిపారు. దీనికి 'సూపర్ అనకొండ' అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది. -
బాలిక అదృశ్యం.. అతడిపై అనుమానం
కార్వేటినగరం: మండలంలోని లక్ష్మీపురం దళితవాడకు చెందిన ఎం.బాబు కుమార్తె ఎం.వాసుకి(16) బుధవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. టీటీ కండిగకు చెందిన విజయ్‌పై అనుమానం ఉన్నట్టు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00690, 9440900689కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రసాద్ కోరారు. -
వాసుకి వచ్చేస్తోంది
టాలీవుడ్లో ప్రజెంట్ డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సంగతెలా ఉన్నా రీల్‌పై డ్రగ్స్ కుంభకోణాన్ని చూడనున్నాం. డ్రగ్స్, అత్యాచారం నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పుదియ నియమం’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఏఆర్ మోహన్ ‘వాసుకి’ పేరుతో తెలుగులోకి అనువదించారు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏకే సాజన్ దర్శకుడు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ‘‘డ్రగ్స్ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి దారుణానికి పాల్పడ్డారు. డ్రగ్స్ తీసుకున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాసుకీకి, డ్రగ్స్‌కి బానిసలైన వాళ్లకూ లింక్ ఏంటి? వాళ్లపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది? అనే అంశాలతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఏఆర్ మోహన్. -
అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార
‘‘ప్రతి జనరేషన్లో మేల్ హీరో రేంజ్లో ఫిమేల్ హీరోయిన్ కూడా ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి... ఇప్పుడు అనుష్క, నయనతార. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ వీరిది. ‘వాసుకి’ ట్రైలర్, పాటలు బాగున్నాయి’’ అన్నారు నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్. నయనతార లీడ్ రోల్లో ఎ.కె. సాజన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియనియమం’ సినిమాను నిర్మాత ఎస్.ఆర్. మోహన్ ‘వాసుకి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘నేనొక లాయర్ని. సినిమాలంటే ఉన్న ఆసక్తితో డబ్బులు కూడబెడుతూ వచ్చి, ‘వాసుకి’ హక్కులు కొన్నాను. ఈ నెల 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఎస్.ఆర్. మోహన్. నిర్మాతలు రాజ్‌కందుకూరి, మల్కాపురం శివకుమార్, టి. రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్ మాదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సమర్పణ: అర్జున్ ఆర్యన్. -
వాసుకి పోరాటం
మలయాళ బ్యూటీ నయనతార టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పుదియ నియమం’. గత ఏడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ‘వాసుకి’ పేరుతో ఎస్.ఆర్. మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మోహన్ మాట్లా డుతూ– ‘‘ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యపై తెరకెక్కిన చిత్రం కావడం, నయనతార లీడ్ రోల్ చేయడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు స్పందన బాగుంది. పంపిణీదారులు కూడా మా సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు ‘వాసుకి’ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘ఆ రచయితను మరణించనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ‘రచయితగా మరణించాను’ అని ప్రకటించిన ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌కు సీపీఎం కేంద్ర కమిటీ అండగా నిలిచింది. ఆయన్ని రచయితగా బతికించుకుంటామని ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, రచయిత వాసుకీ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ రచయితను మరణించనివ్వం అని చెప్పారు. మురుగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూస్తామని, ఆయన కలం నుంచి మరిన్ని చైతన్యవంతమైన రచనలు వెలువడేలా సీపీఎం పోరాడుతుందని వాసుకీ తెలిపారు.