Actress Pakeezah Vasuki Emotional Words About Her Present Situation - Sakshi
Sakshi News home page

ఒకప్పటి కమెడియన్.. ఇప్పుడు ఆమెను చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే..!

Published Tue, Jan 10 2023 9:41 PM | Last Updated on Wed, Jan 11 2023 11:32 AM

pakeeja Character in comedy in assembly rwody movie in telugu - Sakshi

తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ మీకు గుర్తుందా? అంతే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం కామెడీ మామూలుగా పాపులర్ కాలేదు. ఈ చిత్రంలో అందరినీ కడుప్పబ్బా నవ్వించిన పాత్ర మరొకటుంది. బ్రహ్మనందంతో కామెడీ సీన్స్‌లో కనిపించిన పాకీజా రోల్. ఆ చిత్రం ద్వారానే ఆమె  తెలుగులో పాపులర్ అయింది. 

సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు, స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో నటించింది. కానీ.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోంది. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి రిక్త హస్తాలతో మిగిలిపోయి దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. 

ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రాల్లోనూ నటించింది పాకీజా. అందరి స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులోనే దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందరినీ నవ్వించినా ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల ఆమె ఛానెల్‌తో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆమె పరిస్థితికి గల కారణాలను వివరించారు. పాకీజా రోల్‌లో మంచి కమెడియన్  అందరినీ నవ్వించినా పేరు తెచ్చుకున్నా.. ఆస్తులు ఏ మాత్రం లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. 

ఆమె మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా  అందరి సినిమాల్లో చేశా. తెలుగులో దాదాపు 50 సినిమాలు చేశా. ఆ తర్వాత నా స్వస్థలం తమిళనాడులోని కరైకుడికి వెళ్లా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ జయలలిత. 150 చిత్రాల్లో నటించినా చెన్నైలో సొంత ఇల్లు లేదు. సాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు హీరోలను సంప్రదించాను. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నా పరిస్థితిని వివరించా. ఎవరూ సాయం చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ ఉంటున్నా. ఎవరైనా ఆదుకుంటారేమో అని వేచి చూస్తున్నా.' అని ఎమోషనలయ్యారామె. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement