అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార | Vasuki film trailer and song was released in Hyderabad. | Sakshi
Sakshi News home page

అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార

Published Mon, Jul 10 2017 1:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార

అప్పుడు విజయశాంతి.. ఇప్పుడు అనుష్క.. నయనతార

‘‘ప్రతి జనరేషన్‌లో మేల్‌ హీరో రేంజ్‌లో ఫిమేల్‌ హీరోయిన్‌ కూడా ఉంటుంది. ఒకప్పుడు విజయశాంతి... ఇప్పుడు అనుష్క, నయనతార. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్‌ వీరిది. ‘వాసుకి’ ట్రైలర్, పాటలు బాగున్నాయి’’ అన్నారు నిర్మాత కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌. నయనతార లీడ్‌ రోల్‌లో ఎ.కె. సాజన్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియనియమం’ సినిమాను నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహన్‌ ‘వాసుకి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్, పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘నేనొక లాయర్‌ని. సినిమాలంటే ఉన్న ఆసక్తితో డబ్బులు కూడబెడుతూ వచ్చి, ‘వాసుకి’ హక్కులు కొన్నాను. ఈ నెల 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఎస్‌.ఆర్‌. మోహన్‌. నిర్మాతలు రాజ్‌కందుకూరి, మల్కాపురం శివకుమార్, టి. రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సమర్పణ: అర్జున్‌ ఆర్యన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement