‘తొలిప్రేమ’లో పవన్‌ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా? | Interesting Facts About Tholi Prema Actress Vasuki Anand | Sakshi
Sakshi News home page

‘తొలిప్రేమ’లో పవన్‌ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Jan 21 2024 9:11 AM | Updated on Jan 21 2024 11:05 AM

Interesting Facts About Tholi Prema Actress Vasuki Anand - Sakshi

నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

పవన్‌-వాసుకిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకి.. వన్‌ ఫిల్మ్‌ వండర్‌లా ఒక్క సినిమాకే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్‌స్క్రీన్‌పై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల రిలీజై సూపర్‌ హిట్‌ అయిన  ’#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌ సిరీస్‌లో  మిడిల్‌ క్లాస్‌ అమ్మగా అదరగొట్టేసింది. 

వాసుకి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ‘రమణి వర్సెస్‌ రమణి’, ‘మర్మదేశం’ అనే సీరియల్స్‌తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి
వచ్చింది. 



‘తొలిప్రేమ’ సూపర్‌ హిట్‌ కావడంతో తర్వాత  సినీ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది.

‘తొలిప్రేమ’లో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభినాలను చూరగొంది. ఆ సమయంలోనే ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది.

మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమ్‌ అవుతోన్న  ’#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ వెబ్‌సిరీస్‌తో మిడిల్‌ క్లాస్‌ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్‌ కిడ్స్‌కి బాగా రిలేట్‌ అవుతున్నాయి.  

ఇరవై మూడేళ్ళు సినిమాల్లో నటించనప్పటికీ ఆనంద్‌ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉండేది. అందుకే ఇండస్ట్రీకి  దూరంగా ఉన్నాననే ఫీలింగ్‌ కలగలేదెప్పుడూ! – వాసుకి ఆనంద్‌ సాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement