
వరంగల్: చత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తప్పింది. సుకుమా- నారాయణపూర్ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను పోలీసులు గుర్తించారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పాతిపెట్టిన 10 ల్యాండ్‌మైన్లను వెలికితీసి అనంతరం నిర్వీర్యం చేశారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చి నలుగురు జవాన్లను బలితీసుకున్న సంగతి తెల్సిందే. ఎన్నికల వేళ తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననని దండకారణ్యంలోని ఏజెన్సీ గ్రామాల్లో అలజడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment