land mines
-
మందుపాతరలను పసిగడుతుంది
చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్ విద్యార్థులు సుబిన్ కిమ్, జిహూన్ పార్క్ ‘వార్డెన్’ పేరుతో ఈ మైన్ డిటెక్టింగ్ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు. దీని అడుగుభాగంలో మోవింగ్ అటాచ్‌మెంట్‌ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబో మైన్డిటెక్టర్ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. కొరియన్ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు. -
వనరులు ఫుల్.. అవకాశాలు నిల్
గనుల్లో ప్రతీ రోజు లక్షల టన్నుల ముడిసరుకు తవ్వితీసి, వేలాది లారీల్లో పక్క రాష్ట్రాల్లోని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త్రైమాసికంగా రూ.కోట్లల్లో పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. కానీ స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. చదువుకున్న ఈ ప్రాంత యువత వేలల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో సతమతవుతున్నారు. ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషయం తెరపైకి రావడం లేదని తెలిసింది. మల్లంపల్లి, రామచంద్రాపురంలో ఎర్రమట్టి గనులు సాక్షి ములుగు: సహజ వనరుల ఖిల్లా ములుగు జిల్లా. కానీ వనరుల వినియోగంలో మాత్రం నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ములుగు మండలం మల్లంపల్లి నుంచి వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి సరిహద్దు వరకు, మరో వైపు శాయపేట మండల సరిహద్దు వరకు వేలాది ఎకరాల్లో ఎర్రమట్టి గనులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 30పైగా క్వారీల నిర్వహణ జరుగుతుండగా 220 హెక్టార్లకు పైగా భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ప్ర«ధానంగా ఎర్రమట్టి, బాక్సైట్, డోలమైట్, క్రే, లాటరైట్, ఐరన్‌ఓర్ వంటి నిక్షేపాలు తవ్వి తీస్తున్నారు. ఐరన్ ఓర్, ఇసుక, నీరు.. సిమెంట్ తయారీలో కాల్షియం, సిలికాన్, అల్యూమినీయం, ఐరన్‌ఓర్, ఇసుక, నీరు, సున్నపురాయి ప్రధానమైనవి. ఇందులో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో పుష్కలమైన ఐరన్‌ఓర్ ఉంది. అలాగే జిల్లా తలాపున గోదావరి పారుతోంది. మల్లంపల్లి పరీవాహక ప్రాంతానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇసుకతో పాటు, నీటి లభ్యత ఆశించే స్థాయిలో ఉన్నాయి. అలాగే మాన్సింగ్ తండా సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రావాణా పరంగా చూస్తే ఇక్కడి నుంచి వరంగల్ కేంద్రం కేవలం 37 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వరంగల్, కాజీపేటలో రైల్వే కేంద్రాలు రవాణాకు మరింత సౌలభ్యంగా ఉన్నాయి. ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్న మల్లంపల్లి, రామచంద్రాపురం ఏరియాలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుంది. క్వారీలన్నీ లీజు.. ప్రస్తుతం మల్లంపల్లి, రామచంద్రాపురం సమీపంలోని ఎర్రమట్టి క్వారీలు అన్నీ లీజులో నడుస్తున్నాయి. 20 సంవత్సరాల చొప్పున గనుల శాఖ వ్యాపారులకు అప్పగించింది. ఇదంతా పక్కనబెట్టి నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు జరిపి సిమెంట్ ముడి సరుకుకు అవసరమైన ఐరన్‌ఓర్, నాణ్యమైన ఎర్రమట్టిని సేకరించి పరిశ్రమకు ప్రోత్సహిస్తే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతుంది. అనుకున్న మేర ప్రభుత్వం చొరవ తీసుకుంటే సుమరు 3వేల నుంచి 5వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్థానిక వనరులతో పరిశ్రమ ఏర్పాటు చేయాలి మల్లంపల్లి. రామచంద్రాపురం ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరుల ఆధారంగా వీలును బట్టి చిన్న, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక్కడున్న ముడిసరుకును బయటి ప్రాంతాలకు తరలించి పన్నులు వసూలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మల్లంపల్లి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలి. – ధనసరి సీతక్క, ఎమ్మెల్యే, ములుగు ఉపాధి కల్పించాలి మల్లంపల్లిలో సిమెంట్ ఆధారిత, ఖనిజాధార పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఎలాంటి అవకాశాలు లేక యువత హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలలోని పరిశ్రమల్లో పని చేయడానికి వలస వెళ్తున్నారు. – మొర్రిరాజు యాదవ్, మల్లపల్లి -
ఎన్నికల వేళ మావోల కుట్ర భగ్నం
చర్ల: ఎన్నికల్లో విధ్వంసం సృష్టించాలన్న మావోయిస్టుల కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు యాక్షన్ టీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను టార్గెట్ చేసి ల్యాండ్మైన్లను భారీగా మావోలు అమర్చారు. విశ్వసనీయ సమాచారంతో యాక్షన్ టీంను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చత్తీస్‌గఢ్‌లో తప్పిన ప్రమాదం
-
చత్తీస్‌గఢ్‌లో తప్పిన పెను ప్రమాదం
వరంగల్: చత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తప్పింది. సుకుమా- నారాయణపూర్ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను పోలీసులు గుర్తించారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పాతిపెట్టిన 10 ల్యాండ్మైన్లను వెలికితీసి అనంతరం నిర్వీర్యం చేశారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చి నలుగురు జవాన్లను బలితీసుకున్న సంగతి తెల్సిందే. ఎన్నికల వేళ తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననని దండకారణ్యంలోని ఏజెన్సీ గ్రామాల్లో అలజడి నెలకొంది. -
పోలీసులే లక్ష్యంగా.. మందుపాతరలు
వెంకటాపురం: భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం(నుగూరు) మండల పరిధిలోని పాలేం వాగు సమీపంలో శనివారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోలు అమర్చిన మందుపాతరను గుర్తించారు. ప్రాజెక్ట్ సమీపంలోని కొప్పుగుట్ట వద్ద మావోలు అమర్చిన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. -
తుపాకుల నీడలో ఏవోబీ ఎన్నికలు
ఎక్కడ కాలేస్తే ఏ మందుపాతర పేలుతుందో తెలీదు. ఎటు వెళ్తుంటే ఏ తుపాకి గుండు పేలుతుందో తెలీదు. ఎప్పుడొచ్చి ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారో చెప్పలేరు. అయినా.. తప్పనిసరిగా పోటీ చేయాలి, ఎన్నికల్లో నిలబడాలి. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో రాజకీయ నాయకుల పరిస్థితి ఇది. మన రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిషాలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈసారి మన రాష్ట్రంతో పాటు ఒడిషాలో కూడా అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఎన్నికలు కత్తిమీద సాములాగే ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నా, వాటిని బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడం, అయినా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం కోసం నాయకులు ఎలాగోలా నానా కష్టాలు పడి నామినేషన్లు దాఖలు చేయడం ఇక్కడ మామూలే. గ్రామపంచాయతీ సర్పంచి దగ్గర్నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరికీ ఇక్కడ మావోయిస్టుల నుంచి ముప్పు ఉండటం సర్వసాధారణం. గతంలో మంత్రి బాలరాజును ఒకసారి మావోయిస్టులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. అభ్యర్థులు ప్రచారానికి వెళ్తారనుకునే దారుల్లో ముందుగానే మందుపాతరలు అమర్చడం, ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వచ్చే పోలీసులను హతమార్చేందుకు మందుపాతరలు పేల్చి, కాల్పులు జరపడం లాంటి చర్యలకు మావోయిస్టులు పాల్పడటం ఇటీవలి కాలంలో కూడా చూశాం. ఛత్తీస్‌గఢ్‌లో ఇంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం కోసం వచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులు మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా అక్కడ ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు వెళ్తున్న పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోనూ ఈసారి నాయకులు, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా ఎక్కువగా ఏవోబీ మీదే దృష్టి సారించిందని, అందువల్ల అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు ఎక్కడికి ప్రచారానికి వెళ్లేదీ ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని నాయకులకు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. -
ల్యాండ్ మైన్ ఉంటే.. ‘షూ’ పెడుతుంది
మందుపాతరలతో ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. మన వద్దా ఎంతో మంది భద్రత సిబ్బంది మృత్యువాత పడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న సరికొత్త టెక్నాలజీ మైన్స్ నుంచి వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మందుపాతరలను కనిపెట్టే పరికరాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. ఇది వాటన్నిటికంటే భిన్నమైనది. ఇక్కడ మైన్ డిటెక్టర్ షూలోనే ఉంటుంది. అంటే.. మందుపాతరపై అడుగేయకుండా మనల్ని ముందే హెచ్చరిస్తుందన్నమాట. షూలో కాయిల్, మైక్రోప్రాసెసర్, రేడియో ట్రాన్స్మిటర్ ఉంటాయి. కాయిల్ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. కూంబింగ్‌లో భాగంగా భద్రత సిబ్బంది ఈ షూలను వేసుకుని నడిస్తే.. వారికి 2 మీటర్ల పరిధిలో మందుపాతర ఏదైనా ఉంటే.. విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి అవరోధం కలుగుతుంది. దీన్ని మైక్రోప్రాసెసర్ గుర్తించి.. రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా భద్రతా సిబ్బంది చేతికి ధరించే వాచీ వంటి పరికరానికి సంకేతమందిస్తుంది. వెంటనే అలారం మోగి.. మందుపాతర ఎక్కడుందన్న విషయం వాచీపై ప్రదర్శితమవుతుంది. కొలంబియాకు చెందిన లెముర్ స్టూడియో డిజైన్ సంస్థ దీని రూపకర్త. ఆర్థికపరమైన కారణాల వల్ల ‘సేవ్ వన్ లైఫ్’ అనే ఈ వ్యవస్థ ప్రస్తుతం డిజైన్ దశలోనే ఉంది. ఆర్థిక సమస్యలను అధిగమించి.. త్వరలోనే దీని ఉత్పత్తిని చేపడతామని సదరు సంస్థ చెబుతోంది. -
మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి
బీహార్‌లో మావోయిస్టుల ఘాతుకం ఔరంగాబాద్/పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రాగఢ్ మోరె (సర్కిల్) సమీపంలో తాండ్వా-నబీనగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం పోలీసు జీపును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తాండ్వా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి అజయ్ కుమార్ సహా ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నబీనగర్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరై పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి తెగబడినట్లు అదనపు డీజీపీ (హెడ్‌క్వార్టర్స్) రవీంద్ర కుమార్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్పెషల్ ఆక్సిలరీ పోలీసు విభాగానికి చెందిన వారితోపాటు జీపు డ్రైవర్ అయిన హోంగార్డు కూడా ఉన్నట్లు చెప్పారు. పేలుడు అనంతరం ఘటనాస్థలి వద్ద పోలీసులకు చెందిన ఐదు రైఫిళ్లు కనిపించాయన్నారు. మావోయిస్టుల దాడి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్.కె. భరద్వాజ్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఔరంగాబాద్ జిల్లా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డగా ఉంటోంది. 21 మంది మావోయిస్టుల ఆస్తులు అటాచ్ దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో 21 మంది మావోయిస్టులకు చెందిన స్థిరచరాస్తులను నితీశ్ సర్కారు మంగళవారం అటాచ్ చేసింది. ఇందుకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు 39 కేసులు సిద్ధం చేయగా ప్రభుత్వం 21 కేసుల్లో అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్‌జీ భార్యకు చెందిన రూ. 25 లక్షల విలువైన స్థలం కూడా ఈ జాబితాలో ఉంది. -
పాఠశాలలో ముందుపాతరలు ఉన్నాయంటూ నకిలీ ఫోన్
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలోని ఓ పాఠశాల అవరణలో మందుపాతరలు అమర్చినట్లు ఫోన్ కాల్ రావడంతో పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం అందించింది. దాంతో హుటాహుటన పోలీసులు పాఠశాలకు చేరుకుని, పాఠశాలలోని విద్యార్థులతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 400 మందిని అక్కడి నుంచి తరలించింది. అనంతరం బాంబు నిర్వీర్య బృందాలు పాఠశాలలో అడుగడుగున క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. దాదాపు మధ్యాహ్నం 1.30లకు వరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి మందుపాతరలు లేవని బాంబు నిర్వీర్య బృందాలు నిర్థారణకు వచ్చాయి. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ గుర్తించవలసి ఉందని, దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. -
రెండు మందుపాతర్లు వెలికి తీసిన ఒడిశా పోలీసులు
ఒడిశాలోని కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిలో రెండు శక్తిమంతమైన మందుపాతరలను కనుగొని, వెలికి తీసినట్లు కోరాపూట్ జిల్లా ఎస్పీ అశ్విని కుమార్ బుదవారం ఇక్కడ వెల్లడించారు. మావోయిస్టులే ఆ మందుపాతరలను ఉంచినట్లు భావిస్తున్నామన్నారు. స్థానికంగా మావోయిస్టులను కట్టడి చేసేందుకు భద్రత దళాలు, పోలీసులు ఈ ప్రాంతంలో చురుగ్గా వ్యవహారిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిని వెడల్పు చేసేందుకు కార్మికులు పనులు చేపట్టారని, అందులోభాగంగా ఆ ముందుపాతరలను కనుగొన్నట్లు తెలిపారు. అయితే రెండు బకెట్లలో వాటిని ఉంచినట్లు చెప్పారు. వాటికి కరెంట్ వైర్లను అనుసంధానించలేదని, అవి అమర్చి కూడా చాలా రోజులు అయి ఉండవచ్చని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 27న కోరాపూట్ జిల్లాలోని 26వ జాతీయ రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు సరిహద్దు భద్రత సిబ్బంది మరణించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిపై మరన్ని మందుపాతరలు ఉండి అవకాశాలు ఉన్నాయని ఎస్పీ అశ్విని కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.