రెండు మందుపాతర్లు వెలికి తీసిన ఒడిశా పోలీసులు | Land mines unearthed from Koraput-Laxmipur road in Odisha | Sakshi
Sakshi News home page

రెండు మందుపాతర్లు వెలికి తీసిన ఒడిశా పోలీసులు

Published Wed, Oct 23 2013 2:03 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Land mines unearthed from Koraput-Laxmipur road in Odisha

ఒడిశాలోని కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిలో రెండు శక్తిమంతమైన మందుపాతరలను కనుగొని, వెలికి తీసినట్లు కోరాపూట్ జిల్లా ఎస్పీ అశ్విని కుమార్ బుదవారం ఇక్కడ వెల్లడించారు. మావోయిస్టులే ఆ మందుపాతరలను ఉంచినట్లు భావిస్తున్నామన్నారు. స్థానికంగా మావోయిస్టులను కట్టడి చేసేందుకు భద్రత దళాలు, పోలీసులు ఈ ప్రాంతంలో చురుగ్గా వ్యవహారిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిని వెడల్పు చేసేందుకు కార్మికులు పనులు చేపట్టారని, అందులోభాగంగా ఆ ముందుపాతరలను కనుగొన్నట్లు తెలిపారు. అయితే రెండు బకెట్లలో వాటిని ఉంచినట్లు చెప్పారు. వాటికి కరెంట్ వైర్లను అనుసంధానించలేదని, అవి అమర్చి కూడా చాలా రోజులు అయి ఉండవచ్చని చెప్పారు.

 

ఈ ఏడాది ఆగస్టు 27న కోరాపూట్ జిల్లాలోని 26వ జాతీయ రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు సరిహద్దు భద్రత సిబ్బంది మరణించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కోరాపూట్ - లక్ష్మీపూర్ రహదారిపై మరన్ని మందుపాతరలు ఉండి అవకాశాలు ఉన్నాయని ఎస్పీ అశ్విని కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement